ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ప్రక్రియ త్వరలో నాలుగో విడత రుణమాఫీ జాబితా
వీడియో కాన్ఫరెన్స్‌లోరైతుసాధికార సంస్థ సీఈఓ వెల్లడి
కర్నూలు(అగ్రికల్చర్): రుణమాఫీకి సంబంధించి మిగులు నిధులను వెనక్కు పంపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని రాష్ట్ర రైతు సాధికార సంస్థ ముఖ్యకార్యనిర్వహణాధికారి ముధుసూదన్‌రావు తెలిపారు. శుక్రవారం హైద్రాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా బ్యాంక్లర్లతో సమీక్ష నిర్వహించారు. మెదటి విడతలో రుణమాఫి కింద విడుదల చేసిన నిధుల్లో వివిధ కారణాల వల్ల కొంత మొత్తం మిగిలిందన్నారు. వీటిని వెనక్కి పంపేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించామన్నారు.
మిగిలిన నిధులు రైతుసాధికార సంస్థకు చేరిన తర్వాత రుణమాఫీకి సంబంధించి నాలుగవ విడత జాబితా ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత రెండవ విడత నిధులను రైతు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కూడా ఇచ్చిందన్నారు. కర్నూలు నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో ఎల్‌డీసీఎం నరసింహారావు, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, అన్ని బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
మిగిలిన రుణమాఫీ నిధులు వెనక్కు
Published Sat, Mar 12 2016 4:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM
Advertisement
Advertisement