పశ్చిమగోదావరి(భీమవరం): భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో నక్కా దుర్గా రావు అనే విచారణ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీస్ స్టేషన్‌లోని బాత్రూంలో హ్యాంగర్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడాడు. ఈ విషయం తెలిసి పోలీసులు ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
దుర్గారావును పలు దొంగతనాల కేసులో శుక్రవారమే అరెస్టు చేసినట్లు తెలిపారు.