పిల్లల భవిష్యత్తు కాపాడాలి.. | look after child future... | Sakshi
Sakshi News home page

పిల్లల భవిష్యత్తు కాపాడాలి..

Published Mon, Dec 30 2013 4:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM

look after child future...

కరీంనగర్ బిజినెస్, న్యూస్‌లైన్ : తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించి వారి భవిష్యత్తును కాపాడాలని సాంఘిక సంక్షేమ శాఖ  కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రుల సమ్మేళనం ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇందిరా గార్డెన్స్‌లో జరిగింది. గురుకులాల పూర్వ విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు స్వేరోస్ పేరిట ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్నప్పుడు విద్యార్థులు 90 శాతం మార్కులు తెచ్చుకుంటున్నారని, కానీ గురుకులం నుంచి బయటకు వె ళ్లిన తర్వాత చిన్న వయసులోనే వివాహాలు చేసి వారి ఉన్నత జీవితాన్ని తుంచేస్తున్నారని అన్నారు.

 బాగా చదివిస్తే బాగా చదివిన వారికిచ్చి పెళ్లి చేయాల్సి ఉంటుందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారని, ఇలా చేయడం బాధాకరమన్నారు. దీని ద్వారా పిల్లల జీవితాన్ని సమాధి చేసినట్లేనని తెలిపారు. తాను కూడా ఇలాంటి పరిస్థితుల నుంచే ఈ స్థాయి కి వచ్చానని, మహబూబ్‌నగర్‌లో సాంఘిక సంక్షేమ పాఠశాలలో చది వానని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలు తమ కళ్లెదుటే ఉండాలని గ్రామాల్లో ఉంచుకుంటే పిల్లలు మీ కళ్లెదుటే నాశనమవుతారని అన్నా రు. తల్లిదండ్రుల సరైన ప్రోత్సాహం లేక ఎంతోమంది విద్యార్థులుఉన్న త శిఖరాలకు చేరుకోలేకపోతున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ  పిల్లలను తోటి పిల్లలతో పోల్చకూడదని, దీంతో ఇబ్బందులు వస్తాయని సూచించారు.
 
 ఇటువంటి ప్రోత్సాహక కార్యక్రమాలు ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, మెదక్, విశాఖపట్నం, విజనగరం, శ్రీకాకుళం జిల్లాలో జరిగాయని ఖమ్మం, గుంటూర్‌తోపాటు పలు జిల్లాల్లో కూడా నిర్వహిస్తామని తెలిపారు. మనమంతా ప్రస్తుతం గురించి కా కుండా భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు. అనంతరం సైకాలజి స్టులు డాక్టర్ గీతా చల్లా, డాక్టర్ పరంజ్యోతి పిల్లల తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవసరమైన సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
 
 కార్యక్రమంలో సాం ఘిక సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి పి.సంతోష్‌కుమార్, జోనల్ అధికారి సీహెచ్. అరుణ కుమారి, ప్రత్యేక అధికారి కేవీ. చలపతి, అకాడమిక్ కో-ఆర్డినేటర్ జార్జ్ వెర్కీ, స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నారపు ఉపేందర్, వడ్డెపల్లి ప్రభుదాస్, అశోక్‌రెడ్డి, లచ్చయ్య, రాజేందర్,  మన్నన్, ఎర్రోళ్ల రవీందర్, సదానందం, ఎర్ర రాజు, సంక్షేమ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు వారి అభిప్రాయాలు వెల్లడించారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..
 
 నేనూ ఒక స్వేరోనే..
 ప్రస్తుతం నేను కార్యదర్శినైనా గతంలో మహబూబ్‌నగరలో గల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాల యంలో చదువుకున్నాను. అంటే నేను కూడా ఒక స్వేరో నే. ఇటువంటి సమ్మేళనాల ద్వారా పిల్లల తల్లి దండ్రుల్లోని చాలా సమస్యలు పరిష్కారమవుతాయి.
 - డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్,
 రాష్ట్ర కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ
 
 చదువు మధ్యలో ఆపకూడదు..
 ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల చదువు మధ్యలో ఆపకూడదు. దీని వల్ల వారనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. లక్ష్యసాధన పూర్తయ్యాకే పెళ్లి చేయాలి. ఇటువంటి తల్లిదండ్రుల సమ్మేళనాల వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి సమస్యలను, అనుమానాలను నివృత్తి చేయవచ్చు.
 -కే.వీ చలపతి,
 ప్రత్యేక అధికారి
 
 పిల్లల భవిష్యత్తుకు తోడ్పడాలి
 తల్లి దండ్రులు పిల్లల భవిష్యత్తుకు తోడ్పడాలి. చాలా మంది తల్లిదండ్రులు గురుకులంలో చదవు అయిపోగానే తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించకుండా పనులకు పంపిస్తుంటారు. అలా చేస్తే పిల్లల ఉజ్వల భవిష్యత్తు మధ్యలోనే అంతమవుతుంది. ఇటువంటి సమ్మేళనాలతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో మార్పు వస్తుంది.
  - పి.సంతోష్‌కుమార్, రాష్ట్ర సంయుక్త
 కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ
 
 తల్లిదండ్రుల పాత్ర ముఖ్యం..
 విద్యార్థులు వారి భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో స్థిరపడాలంటే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కీలకమైంది. ఈ సమ్మేళనాలతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు తగిన సూచనలిచ్చి ప్రోత్సాహమందిస్తున్నాం. వారు బాగా స్పందిస్తున్నారు.
 - శ్రీమతి డాక్టర్ గీతా చల్లా
 
 స్వేరోస్‌దీ కీలక పాత్ర
 ఇప్పటి వరకు పలు జిల్లాల్లో ఈ సమ్మేళన కార్యక్రమం నిర్వహించాం. ఇకముందు కూడా పలు జిల్లాల్లో నిర్వహిస్తాం. వీటన్నిటిలో స్వేరోస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు సంచరించి విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వారికి కావలసిన సమాచారాన్నిచ్చి అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తున్నారు.
 - జార్జ్ వెర్కీ,
 అకడమిక్ కో-ఆర్డినేటర్
 
 ఇతరులతో పోల్చకూడదు..
 విద్యార్థుల ఫలితాలు, మార్కులు ఇతర ఏ విషయాల్లోనైనా తోటి పిల్లలతో పోల్చకూడదు. ఇది పలు అనర్థాలకు దారీ తీస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులు వారి లక్ష్యసాధన కు తోడ్పడాలి. ప్రతీ నిమిషం వారి భవిష్యత్తు కోసం పాటుపడాలి. ఈ సమ్మేళనాలు విద్యార్థుల కోసమే కాకుండా తల్లిదండ్రులకు కూడా నిర్వహిస్తున్నాం .దీని వల్ల మార్పు వస్తుందని ఆశిస్తున్నాం.
 -సీహెచ్.అరుణకుమారి, జోనల్ ఆఫీసర్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement