ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం | Love couple commit suicide | Sakshi
Sakshi News home page

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

Published Sat, Dec 21 2013 3:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

Love couple commit suicide

 వారిద్దరు ప్రేమించుకున్నారు. కానీ పెద్దలకు చెప్పే ధైర్యం చేయలేకపోయారు. ఈలోగా యువకుడికి పెళ్లి కుదిరింది. దాంతో కలిసి జీవించలేనప్పుడు.. కలిసి తనవు చాలించాలనుకున్నారు. పురుగుల మందు తాగారు. చివరికి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. యువతి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.
 
 ఇచ్ఛాపురం, న్యూస్‌లై న్: ప్రేమ విషయం పెద్దలకు చెప్పి ఒప్పించలేక క్షణికావేశంలో ఓ ప్రేమ జంట పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇందులో ప్రేమికుడు తనువు చాలించగా, ప్రియురాలు ప్రాణాపాయ స్థితిలో వైద్యసేవలు పొందుతోంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలో గొల్లవీధికి చెందిన సాలిన యోగేశ్వరరావు, ఫకీరుపేటకు చెందిన ఓ యువతి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం పెద్దలకు తెలియకపోవడంతో యోగేశ్వరరావుకు ఇటీవల మేనకోడలితో నిశ్ఛితార్థమైంది. మే నెలలో పెళ్లి జరిపేందుకు పెద్దలు ముహూర్తం కూడా నిర్ణరుుంచారు. దీంతో కలత చెందిన ప్రేమికులిద్దరూ నిరాశకు గురయ్యూరు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణరుుంచుకుని ఫకీరుపేటలోని ప్రియురాలి అమ్మమ్మ ఇంటి వెనుక గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో పురుగుల మందు సేవించారు. ఈ విషయూన్ని రాత్రి 2 గంటల సమయంలో ప్రియుడి స్నేహితులకు ప్రియురాలు ఫోన్ చేసి తెలిపింది. దీంతో స్నేహితులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ప్రియుడు శుక్రవారం వేకువజామున మృతిచెందాడు. ప్రియురాలిని మెరుగైన వైద్యసేవల కోసం బరంపురం మెడికల్ సెంటర్‌కు తరలించారు. ఆమె ప్రాణాపాయ స్థితిలో వైద్యసేవలు పొందుతోంది.
 
  మృతుడు యోగేశ్వరరావు తండ్రి చనిపోగా తల్లి దానమ్మ, తమ్ముడు ఢిల్లీరావులు ఉన్నారు. ఉపాధి కోసం విదేశాలలో ఉద్యోగం చేస్తూ ఇటీవలే స్వదేశానికి వచ్చాడు. ప్రియురాలిది ఒడిశా రాష్ట్రం. ఫకీరుపేటలోని అమ్మమ్మ ఇంటివద్ద ఉంటూ డిగ్రీ సెకెండియర్ చదువుతోంది. మృతుడి సోదరుడు ఢిల్లీరావు ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్‌ఐ రాము కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement