విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. విశాఖకు 690 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైవున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు సాయంత్రంలోగా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
దాని ప్రభావం తెలంగాణ ప్రాంతంలో వుండదని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాధ్రంలో ఒకటి రెండ చోట్ల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఉత్తరాంధ్ర జిల్లా యంత్రాంగాం అప్రమత్తమైంది.