
భీమవరం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘రాష్ట్ర ప్రజల్లో అసహనం పెరుగుతోంది. నాయకత్వం అందిపుచ్చుకోవాలి. లేకుంటే ప్రజలు ఛిన్నాభిన్నం అయిపోతారు. ఉద్యమాలకు ఇదే సమయం, నాయకత్వం మరింత రాటుదేలాలి’’ అని సీపీఎం జాతీయ నేతలు కారత్,రాఘవులు రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేశారు.
ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని వినియోగించుకుని బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించేందుకు నడుం కట్టాలని సూచించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మూడు రోజులుగా జరుగుతున్న సీపీఎం రాష్ట్ర 25వ మహాసభలు కొత్త కార్యవర్గం ఎన్నికతో సోమవారం ముగిశాయి. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పి.మధు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment