
గుంటూరు జిల్లాలో మంగళవారం ఉద్రిక్త వాతావారణం నెలకొంది.
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లాలో మంగళవారం ఉద్రిక్త వాతావారణం నెలకొంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని పెదగొట్టిపాడు దళితుల సమస్యలపై మధు స్పందించారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రజాసంఘాలతో కలిసి గ్రామాన్ని సందర్శించాలనుకున్నారు.
అయితే సీపీఎం నేతలను పెదగొట్టిపాడుకు వెళ్లనివ్వకుండా పోలీసులు ముందుస్తు అరెస్టులు చేపట్టారు. ఇందులో భాగంగా మధుతో పాటు పలువురు సీపీఎం నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.