'పుష్కరాల్లో గోదావరికి మహా హారతి'
హైదరాబాద్: వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లో గంగా హారతి తరహాలో గోదావరి హారతి ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు వెల్లడించారు. గురువారం హైదరాబాద్లో మాణిక్యాలరావు మాట్లాడుతూ... నర్సాపురం, కొవ్వూరు, రాజమండ్రిలలో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
పుష్కరాలు సందర్భంగా టీటీడీ ఆన్లైన్ బుకింగ్లో 11 వేల టికెట్లు ఉంచుతామన్నారు. గోదావరి పుష్కరాలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారని చెప్పారు. గతంలో పుష్కరాలకు కేంద్రం రూ. 50 కోట్లు నిధిలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ సారి ఆసాయాన్ని రూ. 100 కోట్లుకు పెంచాలని కేంద్రాన్ని కోరతామని మాణిక్యాలరావు తెలిపారు.