'విభజన రక్కసిని అంతమొందిస్తాం' | Mahila simha Garjana in Kurnool | Sakshi
Sakshi News home page

'విభజన రక్కసిని అంతమొందిస్తాం'

Published Thu, Sep 12 2013 12:06 PM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM

Mahila simha Garjana in Kurnool

కర్నూలు :  సమైక్యాంధ్రకు మద్దతుగా కర్నూలులో మహిళ సమైక్య సింహగర్జన చేసింది. స్త్రీ అంటే అబల కాదు... నరకాసురుడ్ని సంహరించినట్లుగా విభజన రక్కసిని అంతమొందించే వరకూ విశ్రమించేది లేదంటూ మహిళలు ప్రతినబూనారు. గురువారం కొండారెడ్డి బురుజు నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు.

మహిళ గర్జనలో అన్ని కళాశాలలకు చెందిన విద్యార్థినులు, ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగినిలు, మహిళా కళాకారులు, మేధావులు, వ్యాపారవేత్తలు, గృహిణులు సహా వివిధ వృత్తుల్లోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకూ ఉద్యమిస్తామని మహిళలు స్పష్టం చేశారు. సోనియాగాంధీకి మహిళ గర్జన వినిపించాలని వారు పెద్ద ఎత్తున నినదించారు. సమైక్యాంధ్రే తమ థ్యేమమని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement