
ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన యువకునికి దేహశుద్ధి
కళాశాల విద్యార్థినిపట్ల అనుచితంగా ప్రవర్తించిన యువకునికి యలమంచిలిలో శుక్రవారం దేహశుద్ధి చేశారు.
యలమంచిలి : కళాశాల విద్యార్థినిపట్ల అనుచితంగా ప్రవర్తించిన యువకునికి యలమంచిలిలో శుక్రవారం దేహశుద్ధి చేశారు. ఒక ప్రైవేట్ కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థినిని విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన గేదెల గణేష్ అనే యువకుడు అడ్డగించి సైకిల్ తాళం తీసుకున్నాడు. తనతో మాట్లాడాలని ఒత్తిడి తెచ్చాడు. ఇది గమనించిన ఒక పత్రికా విలేకరి ఫొటో తీయబోగా పరుగున వెళ్లిపోయాడు. కొక్కిరాపల్లి పీఏసీఎస్ సమీపంలో అతడ్ని పట్టుకున్నారు.
సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు అతడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పట్టణ పోలీసులకు అప్పగించారు. వారు కూడా తమదైన శైలిలో యువకుడికి కోటింగ్ ఇచ్చారు. ఇక ముందు ఇలాంటి చర్యలకు పాల్పడనని రాతపూర్వకంగా యువకుడు హామీ తీసుకుని యువకుడ్ని విడిచి పెట్టారు.