హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఫొటోతో ఓటు నమోదుకు యత్నించిన ఓ వ్యక్తిపై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదయ్యింది. ఇన్‌స్పెక్టర్ బాలకోటి సమాచారం మేరకు... గచ్చిబౌలి ఇందిరానగర్‌కు చెందిన అస్లాం అనే వ్యక్తి సల్మన్‌ఖాన్ ఫొటో పెట్టి ఓటరు నమోదు ఫామ్-6ను సమర్పించాడు. ఇది గమనించిన సిబ్బంది ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మనోహర్ దృష్టికి తెచ్చారు.
దీంతో ఆయన నియోజక వర్గ ఓటరు నమోదు కార్యక్రమ ప్రత్యేక అధికారి రవీందర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన అదేశాల మేరకు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు వ్యక్తిపై ఐపీసీ 420, 419 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో దరఖాస్తులో ఉన్న చిరునామా తప్పుగా ఉందని ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.
సల్మాన్ ఫొటోతో ఓటుకు దరఖాస్తు చేసిన వ్యక్తిపై కేసు
Published Fri, Dec 27 2013 9:41 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement