
స్నేహితులతో కాపాక రవిప్రకాష్ (సర్కిల్‌లో యువకుడు)
పశ్చిమగోదావరి, పెరవలి: కార్తీక వనసమారాధనలో విషాదం చో టుచేసుకుంది. ఓ యువకుడు గోదావరిలో గల్లంతైన ఘటన పెరవలి మండలం కాకరపర్రు వద్ద చోటుచేసుకుంది. తణుకు ఎస్సై వి.జగదీష్ తెలి పిన వివరాలిలా ఉన్నాయి.. తణుకుకు చెందిన కాపాక రవిప్రకాష్ (23), మంచాల నరేష్ కు మార్ అయ్యప్ప, గుండెమొగుల సాయి, కుంపట్ల సాగర్ అనే యువకులు ఆదివారంం మధ్యాహ్నం వనసమారాధనకు కాకరపర్రు వచ్చారు. మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత 3 గంటల ప్రాంతంలో గోదావరి అవతలి ఒడ్డుకు వెళ్లారు. అక్కడ కొద్దిసేపు సరదాగా గడిపి తిరిగి గోదావరిలో మరోమార్గంలో వస్తుండగా రవిప్రకాష్ సుడిగుండంలో చిక్కుకున్నాడు. స్నేహితులు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు గజ ఈతగాళ్లు, మర్కాలను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు.
స్నేహితుల కన్నీరుమున్నీరు
నీటిలో మునిగిపోతున్న రవిప్రకాష్‌ను కాపాడేం దుకు ఎంతగానో ప్రయత్నించామని, సాధ్యం కా లేదని స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. కార్తీకమాసం ఆదివారం కావడంతో సరదాగా పిక్నిక్‌కు వచ్చామని విలపించారు. తామంతా చిన్నప్పటి నుంచి స్నేహితులమని, ఏటా కార్తీకమాసంలో కలుస్తుంటామని బోరుమన్నారు.
మిన్నంటని రోదనలు
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే రవిప్రకాష్ కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి రోదనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment