గోరంట్ల(అనంతపురం): అనంతపురం జిల్లా గోరంట్ల మండలం గుంటిపల్లి తండాలో బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో శ్రీనివాసనాయక్(42) అనే వ్యక్తి మృతిచెందాడు. గుంటిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ నాయక్ మృతికి వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన శ్రీరామ్ నాయక్ అతనిని హత్యచేసి ఉంటాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు.
దీంతో మనస్తాపానికి గురైన శ్రీరామ్ నాయక్ కూడా పురుగుల మందు తాగి గురువారం ఉదయం ఆత్మహత్యాయత్నం చేశాడు. అతనిని హిందూపురం ఆస్పత్రికి తరలించారు. కాగా, శ్రీనివాసనాయక్ మృతికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతికి గల కారణాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
Published Thu, Feb 19 2015 11:53 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM
Advertisement
Advertisement