నెల్లూరు: కేసు విచారణ కోసం పోలీసు స్టేషన్కు తీసుకువచ్చిన వ్యక్తిపై పోలీసులు లాఠీలతో తమ ప్రతాపాన్ని చూపారు. దీంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. గాయపడిన వ్యక్తిని పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోవూరు పోలీసుస్టేషన్లో శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది.
అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కొవురు పట్టణంలో ఇటీవల చోరీ జరిగింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. విచారణ కోసం తీసుకువచ్చిన వ్యక్తిపై పోలీసులు తమ లాఠీలతో విచక్షణరహితంగా కొట్టారు.