
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విజయవాడ : ప్రేమ పేరుతో మైనర్ బాలికను వంచించిన ఓ వ్యక్తిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. మైనర్ బాలికకు గడ్డం జగదీశ్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో అతని నిజస్వరూపం బయటపడింది. అమ్మాయికి తరచూ ఫోన్ చేసి వీడియో కాల్స్ మాట్లాడటం. నగ్నంగా ఫొటోలు తీసి శారీరంగా, మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా బ్లాక్‌మెయిల్ చేసి పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేశాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. జగదీశ్ మాయలో పడి చాలామంది మోసపోయినట్టు పోలీసుల విచారణలో బయటపడినట్టు సమాచారం. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, తమ కొడుకు కనబడటం లేదని సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో జగదీశ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.