మన్యం ఉద్రిక్తం | Maoist bandh tomorrow | Sakshi
Sakshi News home page

మన్యం ఉద్రిక్తం

Published Wed, Oct 29 2014 1:19 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

మన్యం ఉద్రిక్తం - Sakshi

మన్యం ఉద్రిక్తం

► రేపు మావోయిస్టుల బంద్
► {పజాకోర్టుకు  రావాలన్న దళసభ్యులు
►  చింతపల్లి మేజిస్ట్రేట్‌ను  రక్షణ కోరిన గిరిజనులు  
► ముఖద్వారాల్లో విస్తృత తనిఖీలు
►  ఏజెన్సీలో భయానక   పరిస్థితులు

 
మావోయిస్టు ఉద్యమ చరిత్రలో కొత్త అధ్యాయానికి విశాఖ మన్యం గిరిజనులు శ్రీకారం చుట్టారు. సాయుధ పోరాటంలో ఎన్నడూ లేని విధంగా దళసభ్యులపై తిరుగుబాటుకు పాల్పడ్డారు. ముగ్గురిని హతమార్చి చరిత్ర సృష్టించారు. ఈ సంఘటనతో దళానికి,ఆదివాసీలకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడూ పోలీసుల చర్యలకు నిరసనగా బంద్ నిర్వంహించే మావోయిస్టులు తొలిసారిగా ప్రజల తిరుగుబాటుకు నిరసనగా బంద్ తలపెట్టారు. ఈ పరిణామంతో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు.
 
విశాఖపట్నం :గిరిజనుల దాడిలో సహచరులను కోల్పోయిన మావోయిస్టులు గురువా రం బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీ సులు అప్రమత్తమయ్యారు. ఈస్టు డివి జన్‌లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. శరత్‌పై దాడి చేసిన వారు ప్రజాకోర్టుకు వ చ్చి లొంగిపోవాలని దళసభ్యులు పత్రికలకు విడుదల చేసి న ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు తమకు రక్షణ కల్పించాలంటూ   చింతపల్లి ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు గిరిజనులు వినతిపత్రం ఇచ్చారు. ఈ క్రమంలో ఏజెన్సీ అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 గతేడాది జీకే వీధి మండలం సాగులలో నిరాయుధులైన ముగ్గురు గిరిజనులను మావోయిస్టులు  చంపేశారు. ఇలా జరగడం కొత్తేమీ కాదు. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఈ ఏడాది ఏడుగురి హత్య చేశారు. ఇలా ఏడేళ్లలో సుమారు 20 మంది గిరిజనులు దళసభ్యుల తుటాలకు బలయ్యారు. ఈ నెల 19న చింతపల్లి మండలం కోరుకొండ సమీపంలోని వీరవరంలో సింహా చలం అనే గురుస్వామిని ప్రజాకోర్టులో హతమార్చేందుకు మావోయిస్టులు ప్రయత్నించడంతో పార్టీ ద ళ కమాండర్ శరత్, మిలీషియా స భ్యులు గణపతి, నాగేశ్వరరావులను ప్రతిఘటిం చి గిరిజనులు హతమార్చారు. ఈ చర్యను నిరశిస్తూ మావోయిస్టు పార్టీ ఈ నెల 30న ఈస్ట్‌డివిజన్ బంద్‌కు పిలుపునిచ్చింది. దీనికి అంతా సహకరించాలని పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం ఈ నెల 24న పత్రికలకు ప్రకటన పం పారు. నిజానికి సంఘటన జరిగిన మరుసటి రో జే ప్రతికార దాడులు జరిగే ప్రమాదం ఉందని గిరిజనులు భయపడ్డారు. వెంటనే పోలీసు బల గాలు చింతపల్లి మండలం బలపం, వీరవరం, కోరుకొండ గ్రామాలకు రక్షణ కవచంలా నిలిచాయి.

బిక్కుబిక్కుమంటూ గిరిజనులు

గిరిజనులే మావోయిస్టులను హతమార్చిన సం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల బంద్ పిలుపుతో ఏజెన్సీ, ఏఓబీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మావోయిస్టుల బంద్ పిలుపుతో కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల మా రుమూల ప్రాంతాల్లోని గిరిజనులు భయాందోళనలకు గరువుతున్నారు.  ఈ హత్యలను మావోయిస్టు పార్టీ తీవ్రంగా పరిగణిస్తుండటంతో జిల్లా బంద్‌పై అందరి దృష్టి పడింది.
 
యంత్రాంగం అప్రమత్తం


 మావోయిస్టుల బంద్‌ను భగ్నం చేసేందుకు పోలీసు యంత్రాంగం ఇప్పటికే ఏజెన్సీ మారుమూలతోపాటు ఏఓబీ (ఆంధ్రా-ఒడిశా సరిహద్దు) ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలను ముమ్మరం చేసింది.  మావోయిస్టులు హింసాత్మక సంఘటనలకు పాల్పడతారనే అనుమానంతో పోలీసు యం త్రాంగం మరింత అప్రమత్తమైంది. మండల కేంద్రాలు, ప్రధాన రోడ్లలో తనిఖీలు ముమ్మ రం చేశారు. ఏజెన్సీలోని అన్ని పోలీసు స్టేషన్‌లను అప్రమత్తం చేయడంతో పాటు అన్ని పోలీసు స్టేషన్లకు అదనపు పోలీసు బలగాలను చేర్చినట్లు విశాఖపట్నం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement