ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు | Maoists surrender in visakhapatnam sp | Sakshi
Sakshi News home page

ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

Published Tue, May 19 2015 12:11 PM | Last Updated on Tue, Oct 9 2018 2:40 PM

Maoists surrender in visakhapatnam sp

విశాఖపట్నం: గాలికొండ మావోయిస్టు దళ సభ్యులు మంగళవారం విశాఖపట్నం రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్ ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు విశాఖపట్నం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కోయ ప్రవీణ్ వెల్లడించారు. దళ సభ్యులు వంతల చిన్నంనాయుడు, సన్నంనాయుడుతోపాటు పెదబయలు ఏరియా కమిటీ సభ్యుడు పంగి సోమరాజు, మిలిషియా సభ్యుడు పంగి చంటి లొంగిపోయారు. వీరు పలు కేసుల్లో నిందితులని ఆయన చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావస చర్యల్లో భాగంగా ప్రభుత్వం తరపున అందవలసిన వసతులు అందజేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement