దాంపత్య బంధానికి బలం
లక్షలకు లక్షలు కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తే నెలైనా గడవక ముందే వేధింపులు మొదలవుతాయి... గొప్ప ఇంటి సంబంధమని అమెరికా అబ్బాయికి అమ్మాయినిస్తే అక్కడ అవమానాలు, హింసలూ ఎదురవుతాయి. వందల ఇళ్లల్లో ఈ సమస్యలు ఉంటే బయటకు వచ్చేవి మాత్రం కొన్నే. మిగతా చోట్ల ఆడబిడ్డలు కన్నీళ్లను దిగమింగుకుని బతికేస్తున్నారు. ఇలాంటి సమస్యలకు చట్టబద్ధంగా పరిష్కార మార్గం వెతకాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరని నిపుణులు అంటున్నారు.
ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకునే వారు ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ను కూడా పూర్తి చేసుకుంటే భవిష్యత్‌లో ఎన్నో సమస్యలకు ఇది సమాధానం చెబుతుందని వారంటున్నారు. గొడవల్లోనే కాదు... విదేశీ ప్రయాణాలకు, సంక్షేమ పథకాలకు కూడా ఇది ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు.
- సంతకవిటి
* వివాహ రిజిస్ట్రేషన్లతో ప్రయోజనాలెన్నో
* రిజిస్ట్రేషన్‌పై అవగాహన తప్పనిసరి
మూడుముళ్లు వేసిన తర్వాత భార్యాభర్తలు ఒక్కటైపోవడం, మంత్రాల సాక్షిగా ఒక్కటి గా బతకడం భారతీయ వివాహ వ్యవస్థ గొప్పదనం. అయితే ఆ బంధాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే భవిష్యత్ అవసరాలకు పనికొస్తుందని పెద్దలంటున్నారు. 2002 చట్టం ప్రకారం ప్రభుత్వం వివాహాన్ని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలనే నిబంధనను తీసుకొచ్చింది. కానీ దీన్ని చాలా మంది పట్టించుకోవడం లేదు. రిజిస్ట్రేసన్ ఎందుకు చేయించుకోవాలనే విషయం కూడా చాలా మందికి తెలీదంటే అతిశయోక్తి కాదు.
వివాహాన్ని ఎలా రిజిష్టర్ చేసుకోవాలి? ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి? దీని వల్ల ప్రయోజనం ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. గృహహింసతో పాటు వరకట్న వేధింపులు, చిన్నచిన్న కారణాలుతో విడిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అనంతరం వీరితో పాటు వీరి పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుంది. ప్రేమ వివాహాలు, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న వారి ఇళ్లలో ఈ సమస్య ఎక్కువ. ఇలాంటి పరిస్తితుల్లో వివాహ రిజిస్ట్రేషన్ అనేది ఒక ఆయుధంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వలన ఎన్నో సమస్యలకు పుల్‌స్టాప్ పెట్టవచ్చు.
* విదేశాల్లో ఉన్నవారు ఇక్కడ అమ్మాయిని, అబ్బాయిని వివాహం చేసుకున్న తర్వాత తమ తో పాటు ఆ వ్యక్తిని కూడా తీసుకెళ్లాలంటే ఆ పెళ్లికి సంబంధించిన రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
* ప్రస్తుతం రాష్ట్రంలో పలు పథకాలు అమలవుతున్నాయి. ఈ పథకాలకు సంబందించి అర్హతలుగా భార్య భర్తలకు సంబంధించి వివాహ రిజి స్ట్రేషన్ ద్రువీకరణ పత్రాలు ప్రభుత్వం తప్పనిసరిచేసింది.
* వికలాంగులు-సకలాంగులు స్కీం, ఇంటర్ కేస్ట్ వివాహాలకుసంబంధించి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందాలంటే వివాహాలు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
* జిల్లాలో ఎన్నో వివాహాలు జరుగుతున్నా వాటిలో నమోదు కానివే ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ వివాహాలు ఏవో గుడులు, గోపురాల వద్ద జరుగుతుండగా, పెద్దలు కుదిర్చిన వివాహాలు ఇళ్ల వద్ద జరుగుతున్నా రిజిస్ట్రేషన్లు మాత్రం ఉం డడంలేదు. ఇవి తప్పనిసరిగా రిజిస్టర్ కావాలి.
* 2002 వివాహ చట్టం ప్రకారం ప్రతి కల్యా ణ మండపాల్లో వివాహం జరిగితే అక్కడ కల్యాణ మండపం నిర్వాహకులు సమక్షంలోనే రిజిస్ట్రేషన్‌లు చేయించాలి.
* ముందుగా అందుకు సంబంధించిన వివా హ రిజిస్ట్రేషన్ దరఖాస్తును వధువు, వరుడు చూపించాలి. వీరు అలా చేయకుంటే వివాహాలు ఈ కల్యాణ మండపాల్లో చేయించుకునేందుకు అవకాశం లేదు.
* అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి నోటీసులు అందకపోవడంతో రిజిస్ట్రేషన్లు జరగడం లేదు.
భిన్నమతస్తుల వివాహానికి ఒక్క రోజులో ధ్రువీకరణ పత్రం
హిందూ సంప్రదాయం ప్రకారం భారత ప్రభుత్వం కూడా వివాహాలు రిజిస్ట్రేషన్‌ను వేగవంతం చేసేందుకు పలు సూచనలు, సలహాల ను రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అందిస్తుంది. ఐతే రెండు భిన్న మతస్తులు వారు వివాహాలు చేయించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒక్క రోజులోనే రిజిష్టర్ కార్యాలయం వద్ద ద్రువీకరణ పత్రాలును అందిస్తుంది.
న్యాయస్థానం ఏం చెబుతోంది..?
1872లో ఉన్న పాత వివాహ చట్టాన్ని మార్పు చేసి 1964లో నూతన వివాహ చట్టాన్ని ప్రభుత్వం అమలుచేస్తుంది. 1969లో ఈ చట్టాన్ని మళ్లీ సవరణ చేసి జనన, మరణాలతో పాటు వివాహాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయించాలని ప్రభుత్వం చట్టం చేసింది. ఈ నేపథ్యంలో 2006లో సుప్రీంకోర్టు కూడా మార్గదర్శకాలను విడుదల చేసింది. సరైన మార్గదర్శకాలు, అవగాహన లేకపోవడంతో 99 శాతం మేర వివాహాలు రిజిస్ట్రేషన్ కావడంలేదు.
దరఖాస్తు చేసుకోవాలి..?
వివాహాలు చేసుకున్న వారు రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. పదో తరగతి దాటి చదువుకున్న వారు తమ పదోతరగతి మార్కుల జాబితాను, నివాస స్థలానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, రేషన్, ఆధార్ కార్డుల జిరాక్సులతో పాటు పెళ్లిలో తాళి కట్టిన ఫొటోలు, కుటుంబ పెద్దలు లేదా వివాహ పెద్దలతో కూడిన ఫొటోలుతో రిజిస్ట్రేషన్ కార్యాల యానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ వా రు పరిశీలనల అనంతరం రిజిస్ట్రేషన్ చేస్తారు.
ఉపయోగాలు ఇవే...
* రిజిస్ట్రేషన్‌తో ఆ వివాహానికి చట్టబద్ధత ఏర్పడుతుంది.
* వరుడు కంటే వధువుకు ఎక్కువ ఉపయోగం, సెక్యూరిటీ ఉంటుది.
* ప్రభుత్వం ప్రోత్సాహక పథకాలకు, ఇతర కుటుంబ లబ్ధి పథకాలకు ఉపయోగపడుతుంది.
* విదేశాలకు వెళ్లేందుకు ఉపయోగపడుతుంది.
* రెండో వివాహాన్ని అడ్డుకుంటుంది.
* అమ్మాయిలను మోసగించేందుకు వీలు లేకుండా చేస్తుంది.