
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ గృహిణి కాలిన గాయూలతో మృతి చెందింది. నల్లజర్ల మండలం అనంతపల్లిలో శుక్రవారం
అనంతపల్లి (నల్లజర్ల రూరల్) : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ గృహిణి కాలిన గాయూలతో మృతి చెందింది. నల్లజర్ల మండలం అనంతపల్లిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నారుు. గ్రామానికి చెందిన ఆళ్ల దుర్గారావుకు మేనత్త కుమార్తె గోవిందమ్మ (36)తో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి డిప్లొమా చదువుతున్న కుమారుడు రాజా అరవింద్, 16 ఏళ్ల మమత ఉన్నారు. భర్త దుర్గారావు ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ గోవిందమ్మ పలుమార్లు ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టినట్టు చెబుతున్నారు. పెద్దల సమక్షంలో పరిష్కారాలు జరిగాయి. శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య చిన్న తగాదా జరిగిందని, భర్త, పిల్లలు భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో గోవిందమ్మ బాత్రూమ్‌లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుందని చెబుతున్నారు. ఎగిసిపడ్డ మంటలకు గోవిందమ్మ అరవడంతో భర్త దుర్గారావు, కొడుకు అరవింద్ మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా ఆమె ప్రాణాలు వది లిందని సమాచారం. తాడేపల్లిగూడెం సీఐ జి.మధుబాబు, అనంతపల్లి ఎస్సై ఎం.రాంబాబు శనివారం ఉదయం ఘటనా స్ధలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
అల్లుడే చంపేశాడు
తన కుమార్తె గోవిందమ్మను అల్లుడు దుర్గారావు కిరోసిన్ పోసి, నిప్పంటించి చంపేశాడని మృతురాలి తల్లి నిమ్మకాయల సుబ్బలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకున్న నాలుగున్నర ఎకరాల భూమిలో 3 ఎకరాలు అమ్మేశాడని, ఉన్న భూమిని కూడా పాడు చేస్తాడనే భయంతో పెద్దల సమక్షంలో తన కుమార్తె పేర రాయించానని చెప్పింది. బకారుులు ఉన్నాయనే నెపంతో అందులోనూ అర ఎకరం భూమిని అమ్మేశాడని చెప్పింది. మిగతా భూమి కూడా అమ్మడానికి చేస్తున్న ప్రయత్నాలను తన కూతురు అడ్డుకోవడంతో చంపేశాడని ఆరోపించింది. ఆమె కాపురం బాగుండాలనే ఉద్దేశంతో తాను వేరే ఊరికి మకాం మార్చానని, తాను ఊళ్లో లేకపోవడం చూసి కుమార్తెను అల్లుడు మట్టుబెట్టాడని వాపోరుుంది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని సుబ్బలక్ష్మి, మృతురాలి సోదరుడు చెంచురాముడు పోలీసులను కోరారు.