సాక్షి, అమరావతి: అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కోవిడ్ జాగ్రత్త చర్యలను సూచిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి రాష్ట్ర లెజిస్లేచర్ కార్యదర్శికి ప్రత్యేక నోట్ పంపించారు. ఆ నోట్ ఆధారంగా లెజిస్లేచర్ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు సూచనలు జారీ చేశారు.
ఈ జాగ్రత్తలు పాటించండి
► సభ్యులందరూ తప్పనిసరిగా అన్ని సమయాల్లో మాస్క్‌లు ధరించాలి. సభా మందిరంలోకి ప్రవేశించే ముందు శానిటైజర్లతో చేతులను శుభ్రపర్చుకోవాలి. సభా ప్రాంగణంలో ప్రవేశించే ముందుగానే ఉష్ణోగ్రతను తెలిపే థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. లాబీలు, గ్యాలరీల్లో సభ్యులు గుమిగూడకూడదు.
► లిఫ్ట్‌లో ఇద్దరి కంటే ఎక్కువ ప్రయాణించకూడదు. సభా మందిరంలో సభ్యులు రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలి.
► జ్వరం, దగ్గు, ఆయాసం, వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఉన్నట్టు గుర్తిస్తే తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
► 60 ఏళ్ల వయసు దాటిన సభ్యులు, మధుమేహం, రక్తపోటు, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి కోవిడ్–19 వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మరింత జాగ్రత్తగా ఉండాలి.
► మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పీఎస్‌లు, పీఏలు, పీఎస్‌వోలను తీసుకురాకూడదు. సందర్శకులను అనుమతించరు. అసెంబ్లీ ఆవరణలో ఆందోళనలకు అనుమతి లేదు.
శాసనకర్తలూ.. ఇవి పాటించండి!
Published Mon, Jun 15 2020 3:28 AM | Last Updated on Mon, Jun 15 2020 3:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment