
సీమాంధ్ర కాల్వల ద్వారా చెన్నైకి సరకు రవాణా !
విశాఖపట్నం: కాకినాడ, ఏలూరు, విజయవాడ, బకింగ్హోమ్ కాల్వల ద్వారా చెన్నై, పాండిచ్చేరిలకు సరకు రావాణ చేసేందుకు ఇన్ల్యాండ్ వాటర్ వేస్ అథారటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ రూపకల్పన చేస్తున్నట్లు విశాఖపట్నం ఎంపీ కె.హరిబాబు వెల్లడించారు. అందులోభాగంగా జాతీయ జలరవాణపై ఆదివారం విజయవాడలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
శనివారం విశాఖపట్నంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాల్వల ద్వారా సరకు రవాణ వ్యవస్థ కోసం రూపొందిస్తున్న పథకానికి రూ. 2400 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు హరిబాబు తెలిపారు. ఈ సమావేశానికి కోస్తా జిల్లాలకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని చెప్పారు.