k haribabu
-
ఏపీకి ప్రత్యేక హోదా అర్హత లేదు: బీజేపీ
ప్రత్యేక హోదా అర్హత ఆంధ్రప్రదేశ్‌కు లేదని, దానికంటే ప్రత్యేక ప్యాకేజి లేదా ప్రత్యేక ఆర్థిక సాయం మంచివని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కె. హరిబాబు అన్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన కొన్ని ప్రాజెక్టులు అధికారుల కారణంగా ఆలస్యం అవుతున్నాయని వ్యాఖ్యానించారు. ఏపీలో అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచుకోడానికి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అవకాశం కల్పిస్తోందని ఆయన చెప్పారు. సుపరిపాలన, పేదలకు సంక్షేమ పథకాలు, ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సాధించిన విజయాలు.. వీటన్నింటి వల్ల దక్షిణ భారతంలో తాము విస్తరించడానికి అవకాశాలను మరింతగా పెంచాయని హరిబాబు అన్నారు. ఉత్తరప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో విజయాలను బట్టి చూస్తే ప్రజలకు బీజేపీ మీద, ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన అభివృద్ధి ఎజెండా మీద నమ్మకం ఉన్నట్లు కనిపిస్తోందని ఆయన చెప్పారు. పెద్దనోట్ల రద్దు గురించి ప్రతిపక్షాలు నానా వివాదాలు రేకెత్తించినా.. వాటిని ప్రజలు తిరస్కరించిన విషయం ఎన్నికల ఫలితాలతోనే స్పష్టం అయ్యిందన్నారు. -
'రెండు రోజుల్లో దుబాయ్ టు వైజాగ్'
విశాఖపట్నం: దుబాయ్ నుంచి వైజాగ్‌కు త్వరలో నౌకాయాన మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు చెప్పారు. విశాఖ-పారాదీప్ వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం రెండు రోజుల్లోనే ఈ సముద్ర మార్గం ద్వారా దుబాయ్ చేరుకోవచ్చన్నారు. ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తే రానున్న రోజుల్లో విశాఖ సమీపంలోని పలు ప్రాంతాల్లో ఉన్న పోర్టులన్నీ అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. పోర్టుల అభివృద్ధి ద్వారానే రవాణా పెరిగి ఆదాయం ఆర్జించే అవకాశాలుంటాయని చెప్పారు. దుబాయ్ నుంచి నౌకలు విశాఖ, పారాదీప్, గంగవరం, కాకినాడ వంటి పోర్టులకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. కాగా, పారాదీప్ పోర్టుకు నడుపుతున్నట్టుగానే మార్మ గోవా పోర్టుకు కూడా ప్రత్యేక రైళ్లను నడిపితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాన ఓడరేవుల మధ్య విశాఖ-పారాదీప్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు నడపడం అభినందనీయమన్నారు. మార్మగోవా పోర్టుకు కూడా ప్రత్యేక రైళ్లను విశాఖ నుంచి నడిపితే తూర్పు, పశ్చిమ భారత్‌లలో వాణిజ్య రవాణా అభివృద్ధి అవుతుందన్నారు. రానున్న రోజుల్లో లాజిస్టిక్ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అందుకు అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖలో ఉండడం మరింత మంచి అవకాశమన్నారు. పారాదీప్ వెళ్లే రైలులో చేపల వేటకు వెళ్లే వారంతా అక్కడికి వెళ్లి అక్కడి నుంచి వేటకు వెళ్లేందుకు బాగుంటుందని చెప్పారు. ఇటీవల ప్రారంభమైన విశాఖ-చెన్నై, విశాఖ-గుణుపూర్, విశాఖ-సికింద్రాబాద్ రైళ్లను విశాఖ నుంచి ప్రారంభించక పోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, డీఆర్ఎం అనిల్‌కుమార్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం. ఎల్వేందర్ యాదవ్ పాల్గొన్నారు. -
మహిళల భద్రతకు.. ఐ క్లిక్!
-
ఎంపీ హరిబాబుకు కోపమొచ్చింది!
-
హరిబాబుకి కోపం వచ్చింది
విశాఖపట్నం: విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు కె.హరిబాబుకు కోపం వచ్చింది. దాంతో ఆయన అలిగారు. ఆయన్ని బుజ్జగించేందుకు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగి...హరిబాబును బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయిన ఆయన కోపం తగ్గలేదు. దాంతో హరిబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన మంగళవారం విశాఖపట్నం నగరంలో చోటు చేసుకుంది. విశాఖపట్నంలో మహిళల భద్రత కోసం ఐక్లిక్ విధానాన్ని రాష్ట్ర హోం శాఖ మంత్రి ఎన్. చినరాజప్ప మంగళవారం ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి స్థానిక ఎంపీ హరిబాబును ఆహ్వానించారు. అయితే ఆయన్ని మాత్రం వేదికపైకి ఆహ్వానించ లేదు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. స్థానిక ఎంపీకి ఇచ్చే గౌరవం ఇదేనా అని అంటూ అక్కడే ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులను హరిబాబు ప్రశ్నించారు. దీంతో ఖంగుతిన్న వారు వెంటనే ఆయన్ని శాంతింప చేసేందుకు ప్రయత్నించారు. కానీ హరిబాబు కోపంగా అక్కడనుంచి వెళ్లిపోయారు. -
సీమాంధ్ర కాల్వల ద్వారా చెన్నైకి సరకు రవాణా !
విశాఖపట్నం: కాకినాడ, ఏలూరు, విజయవాడ, బకింగ్హోమ్ కాల్వల ద్వారా చెన్నై, పాండిచ్చేరిలకు సరకు రావాణ చేసేందుకు ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ అథారటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ రూపకల్పన చేస్తున్నట్లు విశాఖపట్నం ఎంపీ కె.హరిబాబు వెల్లడించారు. అందులోభాగంగా జాతీయ జలరవాణపై ఆదివారం విజయవాడలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం విశాఖపట్నంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాల్వల ద్వారా సరకు రవాణ వ్యవస్థ కోసం రూపొందిస్తున్న పథకానికి రూ. 2400 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు హరిబాబు తెలిపారు. ఈ సమావేశానికి కోస్తా జిల్లాలకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని చెప్పారు. -
జీవోఎం ఏం చెప్తుందో చూద్దాం!
* మంత్రుల బృందంతో భేటీకి ఢిల్లీ వెళ్తున్న బీజేపీ * సీపీఐ నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ముగ్గురు * 12, 13 తేదీల్లో సమావేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)తో సమావేశమయ్యేందుకు పలు పార్టీలు సిద్ధమయ్యాయి. బీజీపీ, సీపీఎంల నుంచి ఇద్దరు చొప్పున, సీపీఐ నుంచి ముగ్గురు ప్రతినిధులు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఈ పార్టీల ప్రతినిధులు జీవోఎంతో భేటీ అవుతారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీమాంధ్ర నుంచి డాక్టర్ కె.హరిబాబును ఈ నెల 12న ఈ సమావేశానికి పంపాలని బీజేపీ రాష్ట్ర కోర్‌కమిటీ నిర్ణయించింది. సీపీఐ నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, పార్టీ శాసనసభాపక్ష నాయకుడు గుండా మల్లేష్, సీమాంధ్రకు చెందిన మాజీ ఎమ్మెల్సీ విల్సన్ 12న ఢిల్లీ వెళతారు. సీపీఎం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, పార్టీ శాసనసభాపక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి 13న ఢిల్లీ వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, జీవోఎంకు ఇచ్చిన లేఖకు అనుగుణంగానే వచ్చే సమావేశంలోనూ మంత్రుల బృందం ఏం చెబుతుందో విని, దానికనుగుణంగా స్పందించాలని ఆదివారం జరిగిన బీజేపీ రాష్ట్ర కోర్‌కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ భేటీలో పార్టీ నేతలు కిషన్‌రెడ్డి బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి, టి.ఆచారి, వి.రామారావు, శేఖర్జీ, రవీంద్రరాజు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, నాగం జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర వైఖరేమిటో చెప్పకుండా తమ అభిప్రాయాల్ని అడిగితే స్పందించకూడదని భేటీలో నిర్ణయించారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తూనే సీమాంధ్రుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని జీవోఎంను కోరాలని నిర్ణయించారు. అలాగే, ఈ నెల 20 తర్వాత నాలుగు రథాలతో యాత్రలు నిర్వహించాలని బీజేపీ తీర్మానించింది. హైదరాబాద్, రంగారెడ్డి మినహా తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో జరిగే ఈ యాత్రలకు ఆయా ప్రాంతాల నేతలే సారథ్యం వహిస్తారు. జీవోఎంతో భేటీలో గతంలోలాగానే సమైక్య వాదాన్నే వినిపించాలని సీపీఎం నిర్ణయించింది. విభజన అనివార్యమయితే సీమాంధ్ర సమస్యల్ని పరిష్కరించమని డిమాండ్ చేసే అవకాశం ఉంది. బీజేపీలోకి కెప్టెన్ కరుణాకర్.. బోధన్‌కు చెందిన కెప్టెన్ కరుణాకర్ సోమవారం హైదరాబాద్‌లో బీజేపీలో చేరనున్నారని పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.