సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
శివారు పంచాయతీలను జీహెచ్‌ఎంసీలో కలపాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. గురువారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ.. ఏకపక్షంగా శివారు పల్లెలను గ్రేటర్‌లో చేయడం వల్ల జిల్లా అస్తిత్వానికే ముప్పు ఏర్పడనుందని ఆయన ఆక్షేపించారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా వాటికి పట్టణ హోదా ఇవ్వడం సరైంది కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకనుగుణంగా పంచాయతీల విలీనంపై పునరాలోచన చేయాలని కోరుతూ శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాయనున్నట్లు ప్రసాద్‌కుమార్ తెలిపారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పంచాయతీలకు నగర పంచాయతీలుగా, మున్సిపాలిటీలుగా హోదా కల్పించిన కొన్నాళ్ల తర్వాత గ్రేటర్‌లో విలీనం చేస్తే అర్థవంతంగా ఉండేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి చివరి నిమిషంలో వాటిని విలీనం చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో తగిన సమయం కాదని ఆయన పేర్కొన్నారు.
విలీన నిర్ణయం ఏకపక్షం: మంత్రి ప్రసాద్‌కుమార్
Published Fri, Sep 6 2013 2:23 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM
Advertisement