పల్లెవాసుల కూడు గోడు రోజూ రూ.8తో కడుపు నింపుకుంటున్న గిరిజనులు నిత్యం నీళ్లపులుసు, కారం మెతుకుల తిండి గ్రామీణ ప్రాంత ప్రజల దరిచేరని ప్రభుత్వ పథకాలు పౌష్టికాహార లోపంతో ఏటా 34 శాతం మరణాలు ‘జాతీయ శాంపిల్ సర్వే’లో వెల్లడి
హన్మకొండ
ఈ కాలంలో రూ.ఎనిమిదికి ఏం వస్తుంది... సింగిల్ చాయ్, ఒక్క మస్కా బిస్కెట్ తప్ప ఏం రాదు. అలాంటిది ఈ పైసలతో గిరిజన జీవి ఒక రోజు వెళ్లదీస్తున్నాడు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలు బతికేందుకు ప్రతి రోజూ ఖర్చు పెడుతున్న సొమ్ము అక్షరాలా ఎనిమిది రూపాయలు.
దొడ్డు బియ్యం, నీళ్ల పులుసు, కారం మెతుకులతో రోజులు గడుపుతున్నాడు. ఇదీ... జాతీయ శాంపిల్ సంస్థ చేసిన సర్వేలో తేలిన నిజం. ఈ సంస్థ ఢిల్లీకి చెందిన మరో రెండు సర్వే సంస్థలతో కలిసి గత ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు జిల్లావ్యాప్తంగా 21 మండలాలు, 112 గ్రామాలు, వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్, జనగామ మునిసిపాలిటీ పరిధిలో సర్వే చేపట్టింది. ప్రజల జీవన విధానం, తీసుకుంటున్న ఆహారం, రోజువారీ ఖర్చులు, పౌష్టికాహారం, తిండి కోసం వెచ్చిస్తున్న ఖర్చుల వంటి అంశాలపై స్వీయ పరిశీలన చేసింది. ఒక బృందానికి 100 మంది చొప్పున మొత్తం 14 గ్రూపులు చేసిన సర్వేలో అధ్వానపు పరిస్థితులు బట్టబయలయ్యూరుు. అంతేకాదు... ప్రభుత్వం అందించే రూపాయి కిలో బియ్యం వారి దరికి చేరడం లేదనే నగ్న సత్యం వెలుగుచూసింది. సర్వేలో తేలిన మరి కొన్ని అంశాలు...
పౌష్టికాహారం తీసుకుంటోంది 17 శాతమే..
36 లక్షలున్న జిల్లా జనాభాలో పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యకర జీవనం సాగిస్తున్నది కేవలం 17 శాతం మందే. ఇది కూడా... బడా వ్యాపారులు, ఉద్యోగులు, సంపాదనపరులు మాత్రమే. పౌష్టికాహారం తీసుకుంటున్న జాబి తాలో పట్టణవాసులు 11 శాతం, మునిసిపాలిటీ, మండల కేంద్రాల్లో నివసిస్తున్న వారు 6 శాతం మాత్రమే ఉన్నారు. మిగిలిన వారందరూ బతికేందుకే ఎదో ఒకటి తింటూ కడుపు నింపుకుంటున్నవారే.
ఏటా 34 శాతం మరణాలు
గ్రామీణ ప్రాంతాల్లో తినేందుకు తిండి కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. 51 శాతం గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రతిరోజూ కేవలం రూ. 8 ఖర్చుతో కడుపు నింపుకుంటున్నారు. వారు తినే తిండి అతి దారుణంగా ఉంటోంది. స్థానికంగా దొరుకుతున్న చింతకాయలతో నీళ్ల చారు పెట్టుకుని, పచ్చడి మెతుకుల తిండి తింటున్నారు. తండాలు, అటవీ ప్రాంతాల్లో నివాసం ఉండేవారు వారంలో మూడు రోజులు గంజితోనే గడుపుతున్నారని సర్వేలో వెల్లడైంది. రోజు మొత్తం పనిచేసినా... వారికి పూట గడిచే పరిస్థితులు లేవు. రోజువారి సంపాదనలో తిండి కోసం ఒక్క మనిషి రూ. 8 మాత్రమే వెచ్చిస్తున్నాడని, అంతకు మించి ఖర్చు పెట్టే స్థోమత వారికి లేదని సర్వేలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాలు, తండాలు, అటవీ గ్రామాల్లో పౌష్టికాహార లోపంతో ప్రతి ఏటా 34 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు గుర్తించారు.
అరుునా... లోపమే
మరో 32 శాతం మంది రోజువారి సంపాదనలో రూ. 21 నుంచి రూ.36 వరకు తిండి కోసం వెచ్చిస్తున్నారు. వీరు కూడా పౌష్టికాహార లోపంతో ఉన్నట్లు సర్వేలో తేలింది. పల్లెలు కాకుండా పెద్ద పెద్ద గ్రామాలు, మండల కేంద్రాల్లో నివసిస్తున్న వారే ఈ ఖర్చు చేస్తున్నారు. వీరిలో చిరుద్యోగులు, చిన్న చిన్న వ్యాపారులు, రాజకీయ నేతలు ఉన్నారు.
అందని పథకాలు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి వెళ్లడం లేదని సర్వేలో బహిర్గతమైంది. అటవీ గ్రామాలు, గిరిజన తండాల ప్రజల కు రూపాయి కిలో బియ్యంతోపాటు జీవనోపాధి కల్పించే పథకాలు అందడం లేదు. రూపా యి కిలో బియ్యం అందనివారు పౌష్టికాహార లోపం జాబితాలో అధిక సంఖ్యలో ఉన్నట్లు తేలింది.