సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జెడ్పీ చైర్మన్ ఎన్నికకు ఒక రోజు ముందు నుంచి టీడీపీ నాయకులు మైండ్‌గేమ్ రాజకీయానికి తెరదీశారు. కుట్రలు, కుతంత్రాలు, మాయమాటలతో జిల్లా పరిషత్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. అయితే వీరి ప్రయత్నాలను వైఎస్సార్‌సీపీ నేతలు తిప్పికొడుతున్నారు.
జిల్లాలోని 46 జెడ్పీటీసీలకు గాను ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 31, టీడీపీ 15 దక్కించుకున్నాయి. ఎవరు జెడ్పీ చైర్మన్ కావాలోనని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, టీడీపీ నాయకులు మాత్రం నీచరాజకీయాలకు పాల్పడుతున్నా రు. వైఎస్సార్‌సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రలోభాల కు పాల్పడుతూ వృథా ప్రయాసపడుతున్నా రు. వారి వద్దకు స్వయంగా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వెళ్లి నయానో..భయానో ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎనిమిది మంది సభ్యులు తమ వైపే ఉన్నారని, మీరొక్కరు వస్తే చాలు టీడీపీ గెలుస్తుందని చెబుతూ, అందరినీ బతిమాలుకుంటున్నట్లు తెలిసింది. ఇదే మాట అందరికీ చెబుతున్నారని సమాచారం. మీరొక్కరొస్తే చాలు అంటూ అందరిని కోరుతూ, వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారని సమాచారం. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని అధిక శాతం ఎంపీపీలు వైఎస్సార్‌సీపీ దక్కించుకోవడంతో పట్టుకోల్పోతున్నామని భయపడుతున్న టీడీపీ నేతలు జెడ్పీ చైర్మన్ పీఠంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మే యర్ పదవిని పోగొట్టుకోవడంపై సీఎం చంద్రబాబు జిల్లా నాయకుల మీద అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో చంద్రబాబును శాంతపరి చేందుకు జిల్లా నాయకులు జెడ్పీ పీఠంపై దృష్టి పెట్టారని, భారీగా ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదని తెలిసింది. ఓ వైపు ప్ర లోభాలకు గురిచేస్తూనే మరోవైపు అధికార దుర్వినియోగానికి పాల్పడేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. కార్పొరేషన్ ఎన్నికల తరహాలో వైసీపీ నాయకులను రెచ్చగొట్టే ప్ర యత్నం చేస్తున్నట్లు సమాచారం. వైసీపీ నాయకులను రెచ్చిపోతే, ఏర్పడే గందరగోళ పరిస్థితిని ఆసరాగా తీసుకుని, ఎన్నికను వాయిదా వేయించుకునేలా కుట్ర ప న్నుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపిం చారు.
కార్పొరేషన్ మేయరు ఎన్నికల్లో ర హస్య బ్యాలెట్ పెట్టాలని, తమ ప్రాణాల కు రక్షణ కల్పించాలని డిమాండు చేస్తూ, ఎన్నికలు వాయిదా వేయాలని కోరారని చెప్పారు. అదే తరహాలో ఈ ఎన్నికను కూ డా తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నార ని తెలిపారు. 31 మంది జెడ్‌పీటీసీ సభ్యు లు తమ వద్దే ఉండగా, వారి కుటుంబ స భ్యుల ద్వారా బేరాలు మాట్లాడుతున్నార ని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ఇటువంటి కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. మీరొస్తే చాలు గెలిచి పోతామని అందరి వద్ద చెప్పుకుని, ఒకొక్కరని తమ వైపుకు తిప్పుకోవాలనే ప్రయత్నాలకు తమ జెడ్పీటీసీ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో లొంగరని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.
జెడ్పీ పీఠం వైఎస్సార్‌సీపీదే : ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి
టీడీపీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, 31 మంది జెడ్పీటీసీ సభ్యులు మా వెంటే ఉన్నారు. నెల్లూరు కార్పొరేషన్ తరహాలో జెడ్పీ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంటాం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా టీడీపీ కుట్రలు పన్నుతోంది. ఆ పార్టీ నేతల మైండ్ గేమ్‌ను వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యులు పట్టించుకోరు. అడ్డదారుల్లో జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడడం మంచి పద్ధతి కాదు.
మైండ్‌గేమ్‌కు చెక్
Published Sat, Jul 5 2014 3:03 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement