టెన్త్‌ పాసైతేనే సర్పంచ్‌ పదవికి పోటీకి అర్హులు | Minimum education is must to the sarpach | Sakshi
Sakshi News home page

టెన్త్‌ పాసైతేనే సర్పంచ్‌ పదవికి పోటీకి అర్హులు

Published Sat, Jun 3 2017 1:30 AM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM

Minimum education is must to the sarpach

 సాక్షి, అమరావతి: గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌ పదవులకు ఇకమీదట పోటీ చేయాలనుకునేవారు కనీసం టెన్త్‌ పాసవ్వాల్సిందే. ఈ మేరకు  కొత్త నిబంధన రానుంది.  గ్రామసర్పంచులకు  చెక్‌పవర్‌ ఉండడం,  సర్పంచ్‌తోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లాపరిషత్‌ చైర్మన్‌ పదవులకు మహిళలు, ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలు గెలిచిన పలుచోట్ల.. వారి స్థానంలో వేరొకరు పెత్తనం చెలాయించడం వంటి కారణాలతో ‘స్థానిక’ ప్రజాప్రతినిధులకు కనీస విద్యార్హత నిబంధన అమలుకు కేంద్రం ప్రతిపాదించింది.

హర్యానా తదితర కొన్ని రాష్ట్రాల్లో కనీస విద్యార్హత  ఉండడం వల్ల.. స్థానిక పాలన  మెరుగ్గా ఉందని అధ్యయనం చేసిన లోక్‌సభ అంచనాల కమిటీ.. దేశవ్యాప్తంగా కనీస విద్యార్హత ఉండాలని ప్రతిపాదిస్తూ కేంద్రానికి నివేదిక అందజేసింది. దీనిపై కేంద్రం  లేఖ రాసింది.దీని పట్ల సానుకూలత వ్యక్తం చేసిన చంద్రబాబు సర్కారు  పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నుంచి నివేదిక కోరింది. ఆ నివేదిక అమల్లోకి వస్తే వచ్చే ఏడాది ఆగస్టు తర్వాత ఎప్పుడైనా జరిగే పంచాయతీ ఎన్నికల్లోనే ఈ నిబంధన అమలుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement