
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యతో పాటు క్రీడలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమని క్రీడల మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్‌లో బంగారు పతకం సాధించిన పీవీ సింధుకు ప్రభుత్వం తరుపున శుభాకాంక్షలు తెలియజేశారు. దేశం తరపున ఒక తెలుగమ్మాయిగా సింధు తొలిసారి ప్రపంచ చాంపియన్ షిప్‌లో బంగారు పతకం సాధించడం గర్వకారణమన్నారు. పీవీ సింధు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు. త్వరలోనే ఏపీ ప్రభుత్వం తరపున సింధుకు ఘన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.