సాక్షి, కాకినాడ: గత ఐదేళ్ల టీడీపీ హయాంలో వడ్డీ రాయితీ చెల్లించలేదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ పాలనలో నిర్లక్ష్యం చేసిన డీసీసీబీలు, సహకార బ్యాంకు లను బలోపేతం చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు బస్సుయాత్ర ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన తప్పులేమిటో ముందు చెప్పాలన్నారు. చంద్రబాబు గ్రాఫిక్స్ వెనుక నిజాలను బయటపెట్టడం తప్పా అని కన్నబాబు ప్రశ్నించారు.(ఐటీశాఖ వద్ద చంద్రబాబు అవినీతి చిట్టా)
బస్సు యాత్ర ఎందుకు..?
ఐటీ సోదాల్లో చంద్రబాబు అవినీతి బాగోతం బయటపడిందని.. ఆయన పీఏ,అనుచరులు లెక్కలు బయటపడ్డాయని విమర్శించారు. 2 వేల కోట్ల వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ బస్సు యాత్ర అని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 8 నెలల్లో ఎవ్వరు ఊహించని విధంగా సుపరిపాలన చేస్తున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులు చెల్లిసున్నామని.. గతంలో చంద్రబాబు 2 వేల కోట్లు ధాన్యం కొనుగోలు కోసం తెచ్చిన సొమ్మును పసుపు-కుంకుమ పథకానికి మళ్లించారని కన్నబాబు గుర్తుచేశారు.(ఐటీ గుప్పిట్లో బిగ్‌బాస్ గుట్టు!)
భూ సేకరణపై మంత్రి సమీక్ష..
కాకినాడ సెజ్‌లో భూ సేకరణ, ఇతర సమస్యలపై కలెక్టర్ మురళీధర్ రెడ్డి,సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్ తో మంత్రి కన్నబాబు సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ సేకరణ, నష్టపరిహారం చెల్లింపుపై స్పష్టమైన ప్రణాళికలను రూపొందించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment