సాక్షి, కృష్ణా జిల్లా: కరోనాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పేర్ని నాని తెలిపారు. గురువారం ఆయన ఎమ్మెల్యే కైలే అనీల్ కుమార్‌తో కలిసి కూచిపూడి క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా క్వారంటైన్‌లో ఉన్నవారితో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి అధికారులు సహకరించాలని.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బందికి అండగా ఉంటామన్నారు. వారిలో మనోధైర్యాన్ని నింపేందుకే రెడ్ జోన్ లలో పర్యటిస్తున్నానని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో మీడియా అందిస్తున్న సేవలను మంత్రి పేర్ని నాని అభినందించారు.
(‘కేసులు దాచిపెట్టాల్సిన అవసరం లేదు’)
లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాల్సిందే..
పామర్రు నియోజకవర్గం సేఫ్ జోన్‌లో ఉందని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కైలే అనీల్ కుమార్ అన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నది అనుమానితులు మాత్రమేనని పేర్కొన్నారు. టెస్ట్‌ల్లో పాజిటివ్ అని తేలితే విజయవాడ కొవిడ్ కేంద్రానికి తరలిస్తామని చెప్పారు. లాక్‌డౌన్ నిబంధనను కచ్చితంగా పాటించాలని.. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని ఎమ్మెల్యే కైలే అనీల్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment