గుర్రంకొండ సభలో మాట్లాడుతున్న రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి,
చిత్తూరు, గుర్రంకొండ : చంద్రబాబూ.. జనం నిన్ను నమ్మే పరిస్థితి లేదని రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ముగింపును పురస్కరించుకుని ఆదివారం గుర్రంకొండలో సంఘీభావంగా వేలాది మందితో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక మార్కెట్ యార్డు నుంచి గుర్రంకొండ బస్టాండు వరకు పాదయాత్ర సాగింది. బస్టాండులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మిథున్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబును జనం ఎన్నటికీ విశ్వసించరన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీకి మంళం పాడిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. రైతుల రుణమాఫీ అరకొరగా చేయడంతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. బ్యాంకుల్లో బంగారు నగలు విడిపిస్తామని చెప్పిన చంద్రబాబు తీరా అధికారంలోకి రాగానే రుణాలు చెల్లించాల్సిందిగా మహిళలకు బ్యాంకు నోటీసులు ఇచ్చారన్నారు. జన్మభూమి కమిటీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ దోచుకుంటున్నారని అన్నారు.
సంక్షేమ పథకాలన్నీ టీడీపీ సానుభూతిపరులకే అందుతున్నాయే తప్ప సామాన్య జనానికి చేరడం లేదన్నారు. హంద్రీ–నీవా జలాలు రప్పిస్తామని ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయన్నారు. 1999, 2014లో రెండుమార్లు బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన సంగతి మరిచిపోయారన్నారు. బీజేపీతో నాలుగున్నరేళ్లు అంటకా గిన చంద్రబాబును మైనారిటీలు ఎప్పటికీ నమ్మరన్నారు. మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ప్రకటించి అమలు చేసిన ఘనత దివంగత మహా నేత రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చి విద్యార్థులను ఆదుకుం టామన్నారు. రైతులకు పెట్టుబడి నిధి కింద రూ. 50 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారన్నా రు. పింఛన్ రూ.2 వేలకు పెంచి వయస్సు కూడా తగ్గిస్తారన్నారు. మైనారిటీల అభ్యున్నతి కోసం జగన్‌మోహన్‌రెడ్డి సబ్‌ప్లాన్ ఇప్పటికే ప్రకటించారన్నారు. గుర్రంకొండలో అభివృద్ధి పనులను టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. తన సొంత నిధులతో తాగునీటి బోర్లు వేయిస్తే వాటికి బోరు మో టార్లను అధికారులు అమర్చనీయకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. పీలే రు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మైనారిటీల నాయకులు ఇక్బాల్ అహ్మద్, నియోజకవర్గ ప్రత్యేక ఆహ్వానితులు హరీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment