తూ.గో: మంత్రులు, మాజీ మంత్రులు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ సమైక్య వాదుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోంది. తాజాగా ఎమ్మెల్యే గాంధీమోహన్ కూడా ఈ కోవలో చేరిపోయారు. మ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని ఓ ఉద్యోగి కోరడంతో గాంధీమోహన్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. 'నేను రాజీనామా చేస్తా.. ఉద్యోగులంతా రాజీనామా చేసి ఉద్యమంలోకి రండి' అంటూ ఆయన సవాల్ విసిరారు. సమైక్యాంధ్ర ఆందోళన కారులు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ పార్టీ నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు.
నిన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా ఈ కోవలో చేరిపోయారు. జిల్లాలోని శుక్రవారం నిర్వహించిన సమైక్య సమరనాదం సభలో ధర్మాన ప్రసంగాన్ని సమైక్యవాదులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ ధర్మానను సమైక్య వాదులు డిమాండ్ చేశారు. సమైక్యవాదుల నినాదాన్ని ఏమాత్రం పట్టించుకోని ఆయన రాజీనామా చేయనని తెగేసి చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని కోరుతూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు పూర్తి మద్దతు ఉంటుందని సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు హామీ ఇచ్చిన నేపథ్యంలో నేతలు ఇలా ప్రవర్తించడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తంది.