కావాలనే దుష్ప్రచారం: ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి
అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే తాను కొనసాగుతానని ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీని వీడుతున్నట్లు తనపై కావాలనే దుష్ప్రచారం చేశారని ఆయన మంగళవారమిక్కత తెలిపారు. 40 ఏళ్లుగా వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో తనకు అనుబంధం ఉందని గుర్నాథరెడ్డి అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వైఎస్ జగన్తో పరిష్కరించుకుంటామని ఆయన తెలిపారు.
మరోవైపు ఇదే విషయంపై వైఎస్ఆర్ సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో ఇబ్బందులు సాధారణమేనన్నారు. గుర్నాథరెడ్డి వ్యవహారంలో మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన ఆరోపించారు.