నా ఫ్ల్లెక్సీల జోలికొస్తే ఊరుకునేది లేదు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : విజయనగరం మున్సిపాలిటీలో ఈనెల 15వ తేదీన మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పట్టణంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన ప్లెక్సీలపై చర్చ జరిపారు. రాజకీయ నాయకులకు చెం దిన ఫ్ల్లెక్సీలు మూడు నాలుగు రోజులకు మించి ఉంచరాదని తీర్మాణించినా ఎందుకు అమలు చేయలేదని టౌన్ ప్లానింగ్ అధికారులపై ఎమ్మెల్యే మీసాల గీత మండిపడ్డారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు తొల గిం చలేకపోతున్నామని సంబంధిత అధికారులు చెప్పగా కౌన్సిల్ తీర్మానం కన్న నాయకుల ఒత్తిళ్లే ఎక్కువా అని ప్రశ్నించారు. దీంతో టౌన్ ప్లానింగ్ అధి కారులు ప్లెక్సీలను తొలగింపునకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడా ఎమ్మె ల్యే ఆదేశాలను అదే పార్టీకి చెందిన గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పల నాయుడు పాటించనంటున్నారు.
నా వరకు వర్తించంటూ మొండికేస్తున్నారు. నా ఫ్ల్లెక్సీల జోలికొస్తే ఊరుకునేది లేదని ఫ్ల్లెక్సీలు తీసేం దుకు వస్తున్న సిబ్బంది, సంబంధిత అధికారులను హెచ్చరిస్తున్నారు. ఇదే విషయమై ఆదివారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్లెక్సీ తొలగింపును వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే అప్పలనాయుడు తీరుపై రాజ కీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. విజయనగరం మున్సిపల్ సాధారణ సమావేశం జరిగిన మరుసటి రోజు నుంచే పట్టణంలో ప్లెక్సీల తొలగింపు చేపట్టారు. ముందుగా వైఎస్సార్ సీపీ, బీజేపీ ప్లెక్సీలను తొలగిం చారు. ఆ తర్వాత టీడీపీ నేతల ఫ్ల్లెక్సీల తొలగింపునకు ఉపక్రమించారు. ఈ క్రమంలో ఆదివారం గజపతినగరం ఎమ్మెల్యే కె. ఎ. నాయుడు ఫ్ల్లెక్సీలు తొలగిస్తుం డగా అనుచరుల ద్వారా ఆయన దృష్టికొచ్చింది. ఇంకేముంది చిర్రెత్తిపోయారు. తొలగిస్తున్న వారిని తీసుకురండి అని అనుచరులకు హుకుం జారీ చేశారు. కలెక్టరేట్ జంక్షన్ వద్ద ప్లెక్సీను తొలగిస్తున్న సిబ్బంది వద్దకెళ్లి అసలెవరు తీయమన్నారు...ఎమ్మెల్యే పిలుస్తున్నారు రండి అని తీసుకెళ్లారు.
తమ వద్దకొచ్చిన సిబ్బందిపై కె.ఎ.నాయుడు మండిపడ్డారు. చెప్పా చేయకుండా ఎలా తీసేస్తారని కాస్త దురుసగా మా ట్లాడారు. దీంతో సిబ్బంది భయపడి అధికారుల ఆదేశాల మేరకు తొల గిస్తున్నామని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే అప్పలనాయు డు కమిషనర్‌కు ఫోన్ చేసి, స్పీకర్ ఆన్‌చేసి మాట్లాడినట్టు తెలిసింది. అసలు ప్లెక్సీలు తీయమన్నది ఎవరు? తీసేయాలని చెప్పిందెవరు? మీ సిబ్బంది మా ప్లెక్సీలు తీసేస్తున్నారని ఫోన్‌లోనే కమిషనర్‌ను ప్రశ్నించగా నాకేం తెలియదు సార్. ప్లెక్సీలు తీసేయమని ఎవరికీ చెప్పలేదు. సిబ్బందితో మాట్లాడుతాను. అవసరమైతే వారిపై చర్యలు తీసుకుంటాను. అని కమిషనర్ తిరిగి చెప్పేసరికి నాయుడు ముందు ఉన్న సిబ్బంది అవాక్కయ్యారు. మొత్తానికి తొలగించిన కె.ఎ.నాయుడు ప్లెక్సీలను యథాస్థానంలో తిరిగి కట్టేసారు.
దీంతో గజపతినగరం ఎమ్మెల్యేకు ఒక రూల్, మిగతా వారికి ఒక రూలా అన్న వాదన మొదలైంది. ఆ ప్లెక్సీలను తొలగించే దమ్ము ఎవరికీ లేదా అ్న ప్రశ్న తలెత్తుతోంది. కాగా కౌన్సిల్ తీర్మానం కన్న నాయకుల ఒత్తిళ్లు ఎక్కువా అని టౌన్ ప్లానింగ్ అధికారులపై మండిపడిన గీత ఇప్పుడు తన తోటి ఎమ్మెల్యే తీరుపై ఎలా స్పందిస్తారో అన్న దానిపై ఆసక్తి నెలకొంది. వాస్తవానికైతే గజపతినగరం ఎమ్మెల్యే అప్పలనాయుడు ప్రస్తుతం స్పీడుగా ఉన్నారు. అన్నింటా ముందంజలో ఉన్నారు. మంత్రి అసమ్మతి కూటమికి పెద్ద దిక్కుగా, ప్రశ్నించడంలో తొలి వ్యక్తిగా నిలుస్తున్నారు. అందరి నోట నానుతున్న నాయకుడిగా ఉన్న అప్పలనాయుడు ప్లెక్సీలను తొలగించే సాహసానికి మీసాల గీత ఒడిగడతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఈ నేపథ్యంలో ఎవరైనా ఒక్కటే అని దగ్గరుండి తొలగిస్తారా? లేదంటే తన వాదనను వెనక్కి తీసుకుం టారా అన్నదానిపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఇక, ఎమ్మెల్యే అప్పలనాయుడు ఫోన్ చేసినప్పుడు కమిషనర్ సోమనారాయణ స్పందించే తీరుపై కూడా చర్చ జరుగుతోంది. తన పరిధిలో ఉన్న అధికారులను, సిబ్బం దికి అండగా ఉండాల్సిన కమిషనర్ ఒక్కసారిగా మాట మార్చడం సరికాదని, ఇలాగైతే ఎలా అని సంబంధిత ఉద్యో గులు అంతర్మథనం చెందుతున్నారు.