Town planning officers
-
కోర్టు చెబితే మాకేంటి?
రామ్‌నగర్ రాక్‌డేల్ లేఅవుట్లో విలువైన ఖాళీ స్థలంపై ఆక్రమణదారుడు కన్నేశాడు. నకిలీ దస్తావేజులు సృష్టించి బహుళ అంతస్థులతో భారీ నిర్మాణం చేపట్టేందుకు 2012లో జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు కూడా వెంటనే అనుమతులు ఇచ్చేయడంతో నిర్మాణం చేపట్టాడు. విషయం తెలిసి అసలు హక్కుదారుడు కోర్టును ఆశ్రయించడంతో గుడ్డిగా ఎలా అనుమతులు ఇచ్చారంటా కోర్టు అధికారులకు చీవాట్లుపెట్టి వెంటనే ప్లాన్ రద్దుచేసి నిర్మాణం ఆపేయాలని ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి నిర్మాణం కొనసాగిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. సాక్షి, విశాఖపట్నం: అక్రమానికి బరితెగిస్తే.. అధికారులే కాదు.. అపర బ్రహ్మలు అడ్డొచ్చినా ఆగేది లేదు.. అడ్డగోలుగా నిర్మాణాలు సాగించేస్తాం అన్నట్లుగా జోన్–3 పరిధిలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. జోన్–3 టౌన్ ప్లానింగ్‌లో కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుండటంతో న్యాయస్థానం తీర్పుల్ని కూడా తుంగలో తొక్కుతూ అక్రమ నిర్మాణాలు కానిచ్చేస్తున్నారు. రామ్‌నగర్ దరి రాక్‌డేల్ లేఅవుట్లో టౌన్ సర్వేనెంబరు 1187లో ఉన్న సుమారు 3600 గజాల స్థలం 25 ఏళ్లుగా వివాదంలో ఉంది. ఈ స్థలానికి ఆనుకుని ఉన్న ఫ్లాట్ నెంబర్ 19లో ఓ వ్యక్తి ఆ సమయంలో ఈ స్థలంపై కన్నేసి, నకిలీ దస్తావేజులు సృష్టించి 2 వేల చదరపు గజాల స్థలంలో నిర్మాణం చేపట్టేందుకు జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నాడు. పూర్తిస్థాయిలో పరిశీలన చేయకుండా సంబంధిత అధికారులు నిర్మాణం చేపట్టేందుకు బిల్డింగ్ అప్లికేషన్ (బీఏ) 10567/2012/జోన్3 పేరున ఆగస్టు 1, 2012 తేదీన అనుమతులు కట్టబెట్టేశారు. ఇంకేముంది అప్పనంగా సంపాదించిన స్థలంలో అడ్డగోలుగా భవన నిర్మాణం సాగించేశారు. అసలు హక్కుదారులు కోర్టును ఆశ్రయించారు. విశాఖపట్నం ఆరో అదనపు జిల్లా జడ్జి అక్టోబర్ 12, 2018న జీవీఎంసీకి మొట్టికాయలు వేసి, ప్లాన్ రద్దుచేయాలని ఎల్.ఎ.నెంబర్ 28/2017, ఓ.ఎస్.నెంబర్ 314/2016తో ఆర్డర్ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ఆ యజమాని యథేచ్చగా ఆ అక్రమనిర్మాణ పనులను చేపట్టడం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది. నగరం నడి»ొడ్డున ఇంత పెద్ద అక్రమ నిర్మాణం సాగుతున్నా జోన్–3 సిబ్బంది పట్టించుకోకపోవడం వెనుక పెద్దమొత్తంలోనే ఆమ్యామ్యాలు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లతను వివరణ కోరగా.. ప్రస్తుతం ఈ స్థలానికి సంబంధించిన వివాదం కోర్టులో ఉండటంతో పనులన్నీ నిలిపి వేశామని తెలిపారు. దీనికి సంబంధించిన ప్లాన్ కూడా అప్పట్లో రద్దు చేశామని వివరించారు. మరోసారి స్థలాన్ని పరిశీలించి సంబంధిత జోనల్ అధికారుల నుంచి నివేదిక తీసుకుంటామని వెల్లడించారు. -
'ఇప్పటి వరకు 492 అక్రమ కట్టడాలు కూల్చివేత'
హైదరాబాద్ : నగరంలో జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన అక్రమ కట్టడాల గురువారం నాలుగోరోజుకు చేరుకుంది. అందులోభాగంగా ఈ రోజు వివిధ సర్కిళ్లలోని టౌన్ ప్లానింగ్ అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ...బఫర్‌జోన్ దాటి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే చెరువుల మధ్యలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూడా కూల్చేయాలని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 492 అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు కమిషనర్ వెల్లడించారు. -
అక్రమ నిర్మాణాల కూల్చివేత
అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారలు కొరడా ఝులిపించారు. తీసుకున్న అనుమతికి మించి మరో అంతస్తు నిర్మించడానికి వేసిన పిల్లర్లను కూల్చివేశారు. సోమవారం బాగ్ అంబర్‌పేట డివిజన్ నందనవనం కాలనీలో ఓ భవన యాజమాని జీ ప్లస్ వన్ భవన నిర్మాణాకి అనుమతి పొంది మరో అంతస్తు నిర్మాస్తున్నట్లు సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సర్కిల్-9బి టౌన్‌ప్లానింగ్ ఏసీపీ సాంబయ్య తన సిబ్బందితో కలిసి వచ్చి అక్రమంగా నిర్మించిన అదనపు అంతస్తును కూల్చివేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాలనీలో నిబంధనలకు విరుద్దంగా తాజాగా మరో ఏడు నిర్మాణాలు చేపట్టినట్లు తమ దష్టికి వచ్చిందని వాటికి కూడా నోటీసులు జారీ చేసి కూల్చివేస్తామన్నారు. అంతే కాకుండా నింభందనలు అతిక్రమించి నిర్మాణాలు పూర్తి చేసుకున్నప్పటికి వాటిపై ప్రత్యేక సర్వే నిర్వహించి నోటీసులు జారీ చేస్తామన్నారు. సోమవారం ఒక్క భవనాన్ని ఎలా కూల్చూతారని మిగితా అన్నింటిని కూల్చలనీ స్థానికులు కొది సేపు టౌన్‌ప్లానింగ్ అధికారులతో వాగ్వివాదం చేశారు. -
క్రమ‘బద్ధకం’
ఏలూరు : పట్టణాల్లో అనుమతులు లేని నిర్మాణాలను క్రమబద్ధీకరించే పనిలో టౌన్‌ప్లానింగ్ అధికారులు బద్ధకాన్ని వీడటం లేదు. దీంతో ప్రభుత్వ ఉద్దేశం నెరవేరకపోగా, స్థానిక సంస్థల ఆదాయం పెరగడానికి ప్రతిబంధకంగా మారిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నెల 27వ తేదీతో క్రమబద్ధీకరణ గడువు ముగియనున్నా అధికారుల్లో చలనం లేదు. ఈ కార్యక్రమంపై భవన యజమానులకు ఒక్కసారి కూడా అవగాహన సదస్సులను నిర్వహించలేదు. ప్లాట్లు, అపార్టుమెంట్ల నిర్మాణాలు జరిగే ప్రాంతాల్లో క్రమబద్ధీకరణపై కరపత్రాలు, ఇతర విధాలుగా ప్రచారం చేయాలన్న అంశాన్ని అధికారులు గాలికొదిలేశారు. ఇప్పటికే పలుమార్లు అవకాశం అనుమతులు లేని నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వంద చదరపు మీటర్లు, ఆపైబడి నిర్మించిన భవనాలు అర్హమైనవిగా పేర్కొంది. దీనికి సంబంధించి జీవో నెంబరు 128ని 2015 మేలో జారీచేసింది. గతంలో 1996 సంవత్సరంలో ఆ తరువాత 2008లోనూ ప్రభుత్వం క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. ఏడేళ్ల విరామం అనంతరం మరోసారి జీవో జారీచేసింది. 2008లో ప్రజల నుంచి స్పందన బాగా వచ్చింది. ఆరువేలకుపైగా దరఖాస్తులు రాగా వీటి ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 10 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఈసారి రూ.20 కోట్ల వరకు సమకూరుతుందని ఉన్నతాధికారులు అంచనా వేశారు. అయితే అంత ఆదాయం సమకూరుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 100లోపే దరఖాస్తులు ఏలూరు కార్పొరేషన్, మిగిలిన మునిసిపాల్టీల్లో 100లోపే దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఏలూరులో అపార్ట్మెంట్లు, ఇతర నిర్మాణాలు క్రమబద్ధీకరించుకునేందుకు 25 దరఖాస్తులను భవన యజమానులు సమర్పించినట్టు తెలిసింది. ఇక్కడ గతంలోనే బీపీఎస్‌లో క్రమబద్ధీకరణకు డిపాజిట్లుగా వచ్చిన సొమ్మును పెద్ద మొత్తంలో ఓ ఉద్యోగిని పక్కదారి పట్టించారు. ఆ అంశం ఎటూ తేలలేదు. దీంతో అప్పుడు దరఖాస్తు చేసుకున్నవారిలో కొంతమంది ఇప్పుడు దరఖాస్తు చేయాలా? వద్దా అన్న మీమాంసలో ఉన్నారు. అంతా ఆన్లైన్ విధానం ఈసారి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అన్ని పత్రాలను స్కాన్ చేసి ఉంచుకోవాలి. నెట్ వెబ్సైట్లోకి వెళ్లిన అనంతరం అడిగిన దరఖాస్తుల వివరాలకు సమాధానాలిస్తూ స్కాన్ పత్రాలను అప్లోడ్ చేయాలి. నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ. 10 వేలు చెల్లించాలి. తదుపరి ప్రక్రియలు అన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి. ఎన్నో ఇబ్బందులు దరఖాస్తు పత్రాలు చాలావరకు ఎ4 సైజుకు మించి ఉన్నాయి. అందుకు తగ్గట్లు స్కానర్లు లేవు. ఉన్నచోట్ల బోలెండత ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనికితోడు నెట్ బ్యాకింగ్ కావడంతో సాంకేతిక సమస్యలకు తోడు ఏదైనా పొరపాటు జరగొచ్చనే భయంతో జనం ముందుకు రావడం లేదు. అప్లోడ్ చేసిన దరఖాస్తులను చూసుకొనేందుకు పట్టణ ప్రణాళిక విభాగంలో పూర్తి స్థాయిలో సాంకేతిక పరికరాలు లేవు. కనీసం కంప్యూటరు, ఇంటర్నెట్ సౌకర్యం సైతం అందుబాటులో లేవు. అందినకాడికి దోచుకున్నారు ఎక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయో కింది స్థాయి సిబ్బంది విచారణ జరిపి, నిర్మాణదారులకు పురపాలక సంఘానికి అనుసంధానకర్తలుగా వ్యవహరించాలి. పురపాలక సంఘాలకు ఆదాయం పెంచేలా చూడాలి. క్షేత్రస్థాయిలో అది ఎక్కడా కానరావడం లేదు. అనుమతులు లేని నిర్మాణాలు, విస్తరణ పనులు కనిపిస్తే చాలు. సిబ్బందికి పండగే. అందినకాడికి దోచుకొని ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. కొత్తగా వచ్చిన అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలపై ఆసక్తి చూపడం లేదు. కిందిస్థాయి సిబ్బంది పైనే ఆధారపడుతున్నారు. జిల్లాలో పుష్కరాల నేపథ్యంలో క్రమబద్ధీకరణపై అధికారులు దృష్టిపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. -
నా ఫ్ల్లెక్సీల జోలికొస్తే ఊరుకునేది లేదు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : విజయనగరం మున్సిపాలిటీలో ఈనెల 15వ తేదీన మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పట్టణంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన ప్లెక్సీలపై చర్చ జరిపారు. రాజకీయ నాయకులకు చెం దిన ఫ్ల్లెక్సీలు మూడు నాలుగు రోజులకు మించి ఉంచరాదని తీర్మాణించినా ఎందుకు అమలు చేయలేదని టౌన్ ప్లానింగ్ అధికారులపై ఎమ్మెల్యే మీసాల గీత మండిపడ్డారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు తొల గిం చలేకపోతున్నామని సంబంధిత అధికారులు చెప్పగా కౌన్సిల్ తీర్మానం కన్న నాయకుల ఒత్తిళ్లే ఎక్కువా అని ప్రశ్నించారు. దీంతో టౌన్ ప్లానింగ్ అధి కారులు ప్లెక్సీలను తొలగింపునకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడా ఎమ్మె ల్యే ఆదేశాలను అదే పార్టీకి చెందిన గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పల నాయుడు పాటించనంటున్నారు. నా వరకు వర్తించంటూ మొండికేస్తున్నారు. నా ఫ్ల్లెక్సీల జోలికొస్తే ఊరుకునేది లేదని ఫ్ల్లెక్సీలు తీసేం దుకు వస్తున్న సిబ్బంది, సంబంధిత అధికారులను హెచ్చరిస్తున్నారు. ఇదే విషయమై ఆదివారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్లెక్సీ తొలగింపును వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే అప్పలనాయుడు తీరుపై రాజ కీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. విజయనగరం మున్సిపల్ సాధారణ సమావేశం జరిగిన మరుసటి రోజు నుంచే పట్టణంలో ప్లెక్సీల తొలగింపు చేపట్టారు. ముందుగా వైఎస్సార్ సీపీ, బీజేపీ ప్లెక్సీలను తొలగిం చారు. ఆ తర్వాత టీడీపీ నేతల ఫ్ల్లెక్సీల తొలగింపునకు ఉపక్రమించారు. ఈ క్రమంలో ఆదివారం గజపతినగరం ఎమ్మెల్యే కె. ఎ. నాయుడు ఫ్ల్లెక్సీలు తొలగిస్తుం డగా అనుచరుల ద్వారా ఆయన దృష్టికొచ్చింది. ఇంకేముంది చిర్రెత్తిపోయారు. తొలగిస్తున్న వారిని తీసుకురండి అని అనుచరులకు హుకుం జారీ చేశారు. కలెక్టరేట్ జంక్షన్ వద్ద ప్లెక్సీను తొలగిస్తున్న సిబ్బంది వద్దకెళ్లి అసలెవరు తీయమన్నారు...ఎమ్మెల్యే పిలుస్తున్నారు రండి అని తీసుకెళ్లారు. తమ వద్దకొచ్చిన సిబ్బందిపై కె.ఎ.నాయుడు మండిపడ్డారు. చెప్పా చేయకుండా ఎలా తీసేస్తారని కాస్త దురుసగా మా ట్లాడారు. దీంతో సిబ్బంది భయపడి అధికారుల ఆదేశాల మేరకు తొల గిస్తున్నామని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే అప్పలనాయు డు కమిషనర్‌కు ఫోన్ చేసి, స్పీకర్ ఆన్‌చేసి మాట్లాడినట్టు తెలిసింది. అసలు ప్లెక్సీలు తీయమన్నది ఎవరు? తీసేయాలని చెప్పిందెవరు? మీ సిబ్బంది మా ప్లెక్సీలు తీసేస్తున్నారని ఫోన్లోనే కమిషనర్‌ను ప్రశ్నించగా నాకేం తెలియదు సార్. ప్లెక్సీలు తీసేయమని ఎవరికీ చెప్పలేదు. సిబ్బందితో మాట్లాడుతాను. అవసరమైతే వారిపై చర్యలు తీసుకుంటాను. అని కమిషనర్ తిరిగి చెప్పేసరికి నాయుడు ముందు ఉన్న సిబ్బంది అవాక్కయ్యారు. మొత్తానికి తొలగించిన కె.ఎ.నాయుడు ప్లెక్సీలను యథాస్థానంలో తిరిగి కట్టేసారు. దీంతో గజపతినగరం ఎమ్మెల్యేకు ఒక రూల్, మిగతా వారికి ఒక రూలా అన్న వాదన మొదలైంది. ఆ ప్లెక్సీలను తొలగించే దమ్ము ఎవరికీ లేదా అ్న ప్రశ్న తలెత్తుతోంది. కాగా కౌన్సిల్ తీర్మానం కన్న నాయకుల ఒత్తిళ్లు ఎక్కువా అని టౌన్ ప్లానింగ్ అధికారులపై మండిపడిన గీత ఇప్పుడు తన తోటి ఎమ్మెల్యే తీరుపై ఎలా స్పందిస్తారో అన్న దానిపై ఆసక్తి నెలకొంది. వాస్తవానికైతే గజపతినగరం ఎమ్మెల్యే అప్పలనాయుడు ప్రస్తుతం స్పీడుగా ఉన్నారు. అన్నింటా ముందంజలో ఉన్నారు. మంత్రి అసమ్మతి కూటమికి పెద్ద దిక్కుగా, ప్రశ్నించడంలో తొలి వ్యక్తిగా నిలుస్తున్నారు. అందరి నోట నానుతున్న నాయకుడిగా ఉన్న అప్పలనాయుడు ప్లెక్సీలను తొలగించే సాహసానికి మీసాల గీత ఒడిగడతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎవరైనా ఒక్కటే అని దగ్గరుండి తొలగిస్తారా? లేదంటే తన వాదనను వెనక్కి తీసుకుం టారా అన్నదానిపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఇక, ఎమ్మెల్యే అప్పలనాయుడు ఫోన్ చేసినప్పుడు కమిషనర్ సోమనారాయణ స్పందించే తీరుపై కూడా చర్చ జరుగుతోంది. తన పరిధిలో ఉన్న అధికారులను, సిబ్బం దికి అండగా ఉండాల్సిన కమిషనర్ ఒక్కసారిగా మాట మార్చడం సరికాదని, ఇలాగైతే ఎలా అని సంబంధిత ఉద్యో గులు అంతర్మథనం చెందుతున్నారు. -
ప్లాన్డ్గా నకిలీల సృష్టి
రిమ్స్ క్యాంపస్: టౌన్ ప్లానింగ్ అధికారులు తలచుకుంటే ఏదైనా చేయగలరు. అన్నీ సక్రమంగా ఉన్నా అందాల్సినవి అందకపోతే.. ప్లాన్లు తిరగ్గొట్టగలరు.. ఏమీ లేకపోయినా ముడుపులు అందితే చాలు మంజూరు చేసేయనూగలరూ.. శ్రీకాకుళం పట్టణ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ విషయంలో మరింత ముందడుగు వేశారు. నకిలీ ప్లాన్లపై సంతకాలు గీకేసి.. మాయా మహళ్లనూ సృష్టించగలరనడానికి పట్టణంలో నిర్మించిన ఒక భవంతే నిదర్శనం. గత కమిషనర్ రామలింగేశ్వర్ హయాంలో మంజూరైన ఈ నకిలీ ప్లాన్ తయారీలో కొందరు అధికారుల హస్తం ఉండగా, మరికొం దరి సంతకాలను ఫోర్జరీ చేశారు. పట్టణంలో కొత్త వంతెన ఆవల తమ్మినేని దాలినాయుడు పేరుతో భవన నిర్మాణానికి(బిల్డింగ్ అప్రువల్ నెంబరు 32/2013) ప్లాన్ మంజురైంది. చూడ్డానికి ఇద్ది అన్నీ సక్రమంగా ఉన్న పక్కా ప్లాన్‌గా కనిపిస్తున్నప్పటికీ.. నిశితంగా పరిశీలి స్తే.. పక్కా ప్లాన్‌తో రూపొందించి నకిలీ ప్లాన్ అని తేలింది. మున్సిపల్ రికార్డుల్లో దాలినాయుడు పేరుతో ప్లాన్ మంజూరైనట్లు నమోదు కాకపోగా .. 32/2013 నెంబరుతో హనుమంతు రవికుమార్ పేరిట ప్లాన్ మంజూరైనట్లు ఉంది. ఇది ఒక ఊదాహరణ మాత్రమే. ఇటువంటివి నకిలీ ప్లాన్లు ఎన్నో ఉన్నట్టు మున్సిపల్ వర్గాలే చెబుతున్నాయి. ముడుపులిస్తే చాలు.. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల అధికారులు ముడుపుల మత్తులో జోగుతున్నారు. సొమ్మిస్తే దేనికైనా సిద్ధమంటున్నారు. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు యథేచ్చగా దండుకుంటున్నారు. శ్రీకాకుళంలోని ఈ విభాగం అధికారుల్లో కొందరు నకిలీ ప్లాన్ల తయారీలో నిష్ణాతులని తెలిసింది. ఎటువంటి ధ్రువపత్రాలు లేకున్నా దర్జాగా ప్లాన్ తయారు చేసి ఇచ్చేస్తారు. ఉన్నతాధికారుల సంతకాలను సైతం ఫోర్జరీ చేసి మరీ ప్లాన్ ఇస్తారు. వాస్తవానికి ప్లాన్ లేకుండా పట్టణంలో చాలా భవనాలు ఉన్నాయి. అయితే బ్యాంకు లోన్లు పెట్టుకోవటానికి, వివాదంలో ఉన్న స్థలం తమదని క్లెయిం చేసుకోవటానికి ప్లాన్లు తప్పనిసరి. ఈ నేపథ్యంలో ప్లాన్ అవసరమైన వారు టౌన్‌ప్లానింగ్ అధికారులను కలుస్తారు. ఇవ్వాల్సిన మామూళ్లు సమర్పించుకుని నకిలీ ప్లాన్లు అందిపుచ్చుకుంటున్నారు. ఇలా బయటపడింది తమ్మినేని దాలినాయుడు పేరుతో మంజూరైన నకిలీ ప్లానుకు ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఈ వ్యవహారం బయటపడింది. మున్సిపల్ అధికారులు ఇరకాటంలో పడ్డారు. నకిలీ ప్లాన్ ఆధారంగా సదరు యజమాని బ్యాంకు రుణం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇందుకు అవసరమైన ఎన్వోసీ కోసం మున్సిపాలిటీకి దరఖాస్తు చేశారు. అయితే రికార్డులో ఆ నెంబర్‌తో వేరే వ్యక్తికి ప్లాను మంజూరైనట్లు ఉండటంతో దాలినాయుడు పేరుతో ఉన్నది నకిలీదని తేలింది. దాంతో ఎన్వోసీ ఇచ్చేందుకు కొందరు అధికారులు నిరాకరిస్తున్నారు. నకిలీ వ్యవహారంలో పాత్ర ఉన్నవారు మాత్రం ఎలాగైనా ఎన్వోసీ ఇప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటాం బాపిరాజు, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ విభాగంలో నకిలీ ప్లాన్లు తయారవుతున్న విషయం నా దృష్టికి రాలేదు. రికార్డులను పరిశీలించి నకిలీ ప్లాన్లు ఉన్నట్టు రుజువైతే చర్యలు చేపడతాం. నకిలీ ప్లాన్లు తయారీలో పాత్ర ఉన్న అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటాం. -
ఇద్దరు టౌన్ ప్లానింగ్ అధికారులపై సస్పెన్షన్ వేటు
రాజమండ్రి : రాజమండ్రిలో రెండతస్తుల భవనం కూలిన ఘటనలో ఇద్దరు టౌన్ ప్లానింగ్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. నిన్న రాత్రి పట్టణంలోని నూనెకొట్టు వీధిలో ఓ భవనం కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య రెండుకు పెరిగింది. శిథిలాల కింద ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు చిక్కుకోవటంతో వారిని శిథిలాల నుంచి సురక్షితంగా వెలికి తీశారు. అయితే వారిలో కుటుంబ యజమాని ఆకుల ఆంజనేయులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి చనిపోయిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం జశ్వంత్ (2) చికిత్స పొందుతు మృతి చెందాడు. సహాయక చర్యలు ఈ రోజు తెల్లవారుజాము 3.30గంటల వరకూ కొనసాగాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆకుల ఆంజనేయులు భార్య వెంకటరత్నం ప్రస్తుతం ఆస్పత్రికలో చికిత్స పొందుతోంది. వారి కుమారుడు హనుమాన్, అతని భార్య విజయలక్ష్మి, మనుమడు భార్గవ్(4), సురక్షితంగా ఉన్నారు. కాగా ఈ ప్రమాదం నుంచి వాచ్మెన్ సురక్షితంగా బయటపడినట్లు పోలీసులు వెల్లడించారు. భవనం కూలుతుండగా వాచ్మెన్ భయంతో బయటకు పరుగులు తీసినట్లు తెలిపారు. ఈ రెండతస్తుల భవనాన్ని పదేళ్ల క్రితం నిర్మించారు. అయితే దీని పక్కన ఖాళీస్థలంలో కొత్తగా ఇల్లు నిర్మించేందుకు గొయ్యి తవ్వడంతో భవనం ఆవైపు కూలిపోయింది. అందుకు అనుమతి ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అలాగే బిల్డర్‌పై కేసు నమోదు చేస్తామని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ తెలిపారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించామని, అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.