అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారలు కొరడా ఝులిపించారు. తీసుకున్న అనుమతికి మించి మరో అంతస్తు నిర్మించడానికి వేసిన పిల్లర్లను కూల్చివేశారు. సోమవారం బాగ్ అంబర్‌పేట డివిజన్ నందనవనం కాలనీలో ఓ భవన యాజమాని జీ ప్లస్ వన్ భవన నిర్మాణాకి అనుమతి పొంది మరో అంతస్తు నిర్మాస్తున్నట్లు సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ సర్కిల్-9బి టౌన్‌ప్లానింగ్ ఏసీపీ సాంబయ్య తన సిబ్బందితో కలిసి వచ్చి అక్రమంగా నిర్మించిన అదనపు అంతస్తును కూల్చివేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాలనీలో నిబంధనలకు విరుద్దంగా తాజాగా మరో ఏడు నిర్మాణాలు చేపట్టినట్లు తమ దష్టికి వచ్చిందని వాటికి కూడా నోటీసులు జారీ చేసి కూల్చివేస్తామన్నారు. అంతే కాకుండా నింభందనలు అతిక్రమించి నిర్మాణాలు పూర్తి చేసుకున్నప్పటికి వాటిపై ప్రత్యేక సర్వే నిర్వహించి నోటీసులు జారీ చేస్తామన్నారు. సోమవారం ఒక్క భవనాన్ని ఎలా కూల్చూతారని మిగితా అన్నింటిని కూల్చలనీ స్థానికులు కొది సేపు టౌన్‌ప్లానింగ్ అధికారులతో వాగ్వివాదం చేశారు.