sambaiah
-
ఖరీదు సాంబయ్య.. కర్రసామే శ్వాస, ధ్యాసగా జీవిస్తూ పతకాల పంట
సాక్షి, గుంటూరు(పెదకాకాని): మన భారతీయ సంస్కృతిలోని ప్రాచీన కళల్లో కర్రసాము ఒకటి. కర్రసామే శ్వాస, ధ్యాసగా జీవిస్తూ పతకాల పంట పండిస్తున్నాడు ఖరీదు సాంబయ్య(చంటి). జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగే కర్రసాము పోటీల్లో పాల్గొని అదరకొడుతున్నాడు. దేశవాళీ క్రీడ అయిన కర్రసాములో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక స్థానం ఉండాలని ఆకాంక్షిస్తున్నాడు. ప్రాచీన యుద్ధకళ అంతరించిపోకుండా రక్షించుకుంటూ పది మందికీ నేర్పించాలని తపన పడుతున్నాడు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం గ్రామానికి చెందిన ఖరీదు సాంబయ్య వ్యవసాయ కుటుంబానికి చెందిన వాడు. తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి నాగేంద్రమ్మ. బీఎస్సీ కంప్యూటర్స్ చదువుకున్న సాంబయ్య పలు ప్రైవేటు కళాశాలల్లో జూనియర్ లెక్చరర్‌గా పనిచేశారు. కర్రసాముపై ఉన్న మమకారంతో ఉపాధ్యాయవృత్తికి స్వస్తి చెప్పి ఉదయం గోరంట్ల శివార్లలో చెట్ల కింద, సాయంత్రం వెనిగండ్ల పంచాయతీ కార్యాలయం వద్ద పిల్లలకు కర్రసాము శిక్షణ ఇస్తున్నారు. భార్య రాధిక, 11 ఏళ్ల గీతామాధురి, 10 ఏళ్ల కావ్యశ్రీ సంతానం. ఏడాదిన్నర కాలంలోనే దేశ విదేశాలలో జరిగిన కర్రసాము పోటీల్లో పాల్గొని 32 గోల్డ్‌మెడల్స్, 4 సిల్వర్ మెడల్స్, 3 కాంస్య పతకాలు సాధించాడు. ఏడాదిన్నర కాలంలో సాధించిన కొన్ని విజయాలు.. ►2021 మార్చి 21 నెల్లూరు జిల్లాలో 6వ స్టేట్‌లెవల్ కర్రసాము పోటీలలో బ్రాంజ్‌మెడల్, సర్టిఫికెట్ ►2021 ఆగస్టు 10 కర్నూలు జిల్లాలో జరిగిన కిక్ బాక్సింగ్‌లో భాగమైన మొదటి ఆంధ్రప్రదేశ్ కర్రసాము పోటీలలో బ్రాంజ్‌మెడల్, సర్టిఫికెట్. నేషనల్ లెవల్లో జరిగే గోవా పోటీలకు అర్హత ►2021 సెప్టెంబరు 5 నెల్లూరు జిల్లా సిలంబం స్టిక్ పెన్సింగ్ అసోసియేషన్ వారు –మేజర్ ధ్యాన్‌చంద్ సర్టిఫికెట్, యూనివర్సిల్ ఎచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికెట్, ట్రోఫీ ►2021 సెప్టెంబరు 26 మద్రాస్ సిలంబం ఆఫ్ ఇండియా అసోసియేషన్ వారు వరల్డ్ రిఫరీగా సెలక్ట్ చేసి సర్టిఫికెట్, షీల్డ్‌తో సన్మానం ►2021 నవంబరు 14 కృష్టా జిల్లాలో జరిగిన మొదటి స్టేట్ ట్రెడిషనల్ లాఠీ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించిన కర్రసాము పోటీల్లో గోల్డ్‌మెడల్. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగే నేషనల్ ట్రెడిషనల్ లాఠీ స్పోర్ట్స్ పోటీలకు అర్హత ►2021 డిసెంబరు 25 మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన 2వ నేషనల్ ట్రేడిషనల్ లాఠీ స్పోర్ట్స్ చాంపియన్íÙప్ 2021 పోటీలలో గోల్డ్‌మెడల్ మెడల్. ►2022 ఫిబ్రవరి 13 ఎక్స్లెంట్ వరల్డ్ రికార్డ్స్ వారు ఉత్తరాఖాండలోని హరిద్వార్‌లో ద్రోణాచార్యుడి అవార్డు ►2022 మార్చి 27 వైఎంకే 2022 మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విజయవాడ వారి ఆధ్వర్యంలో ఫస్ట్ నేషనల్ ఓపెన్ కుంగ్‌పూ కరాటే చాంపియన్ íÙప్, కర్రసాము పోటీలలో గోల్డ్‌మెడల్ ► 2022 మే 8 కాకినాడలో జరిగిన రెండవ రాష్ట్రస్థాయి కర్రసాము పోటీలలో కర్ర, రెండు కర్రలు, ఫైటింగ్ విభాగాలలో మూడు గోల్డ్‌మెడల్స్ ►2022 మే 14 రాజస్థాన్ జైపూర్‌లో జరిగిన ఆల్ ఇండియా కర్రసాము చాంపియన్‌షిప్ 2022 నేషనల్ లెవల్ పోటీలలో ఒక కర్ర, రెండు కర్రలు, ఫైటింగ్ విభాగాలలో మూడు గోల్డ్‌మెడల్స్. నేపాల్‌లోని ఖాఠ్మాండ్లో జరిగే ఇంటర్నేషనల్ పోటీలకు ఎంపిక ►2022 మే 28న ఖాఠ్మాండ్లో జరిగిన ఇండో–నేపాల్ ఇంటర్ నేషనల్ గేమ్స్ వారు నిర్వహించిన కర్రసాము పోటీలలో ఒక కర్ర, రెండు కర్రలు, ఫైటింగ్ విభాగాలలో మూడు గోల్డ్‌మెడల్స్. ►2022 జూన్ 26 రాజమండ్రిలో నిర్వహించిన ఫస్ట్ ఇంటర్ స్టేట్ కరాటే చాంపియన్ షిప్ వారు నిర్వహించిన కర్రసాము ఆన్లైన్ పోటీలలో ఒక కర్ర, రెండు కర్రలు, ఫైటింగ్ విభాగాలలో మూడు గోల్డ్‌మెడల్స్. ►2022 జులై 27 నేపాల్ రాజధాని ఖాఠ్మాండ్లో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సౌత్ ఏషియన్ లాఠీ చాంపియన్ షిప్ కర్రసాము పోటీలలో ఒక కర్ర, రెండు కర్రలు, ఫైటింగ్ విభాగాలలో ఒక గోల్డ్, రెండు సిల్వర్ మెడల్స్ ►2022 సెప్టెంబర్ 2 ఉత్తరప్రదేశ్ నోయిడాలో జరిగిన నేషనల్ లెవల్ కర్రసాము పోటీలలో ఒక గోల్డ్, ఒక బ్రాంజ్ మెడల్. ►2022 నవంబరు 13 తెలంగాణ యూసఫ్‌గూడలో జరిగిన ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్‌షిప్ 2022 పోటీలకు 14 మంది శిష్యులతో పాల్గొనగా ఒక కర్ర, రెండు కర్రలు, సురులు, చైన్పంత్, జింక కొమ్ములు, ఫైటింగ్ విభాగాలలో 32 మెడల్స్ వచ్చాయి. వాటిలో గోల్డ్‌మెడల్స్ 18, సిల్వర్ మెడల్స్ 9, బ్రాంజ్ మెడల్స్ 5 రావడం తనకు ఓవరాల్ చాంపియన్‌షిప్ కప్ అందజేసి సన్మానించడం మరపురాని గొప్ప అనుభూతిగా ఆయన ఆనందాన్ని తెలియజేశారు. చదవండి: (సీఎం జగన్ ప్రమాణ స్వీకారం వీడియో చూస్తూ ఆపరేషన్) దాతల సహకారం, ప్రభుత్వ ప్రోత్సాహం కావాలి... కర్రసాములో ఇప్పటివరకు నేను సాధించిన విజయాల్లో దాతల సహాయ సహకారాలు ఎన్నటికీ మరవలేను. ప్రస్తుతం గోరంట్లలో చెట్ల కింద, వెనిగండ్లలో తిరుమలరెడ్డి స్థలంలో కర్రసాము శిక్షణ ఇస్తున్నాను. మొదట్లో పిల్లలకు ఉచితంగానే నేరి్పంచా. అద్దె ఇల్లు కుటుంబ పోషణ భారంగా మారింది. దాతల సహకారంతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే బ్యాచ్‌ల వారీగా బాల బాలికలకు, యువతీ యువకులకు ఉచితంగా కర్రసాము మెలకువలు నేరి్పంచి తీర్చిదిద్దుతా. కర్రసాములో మన రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉండేలా కృషి చేస్తా. ఇటీవల జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డిని కలవగా శాప్ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. – ఖరీదు సాంబయ్య(చంటి), కర్రసాము శిక్షకుడు, గుంటూరు పతకాల పంట కర్రసాముగా పిలుచుకునే ఈ క్రీడను తమిళనాడులో సిలంబం, కేరళలో కలరిపట్టు, మధ్యప్రదేశ్‌లో ట్రెడిషనల్ లాఠీ వంటి పేర్లతో పిలుస్తున్నారు. కర్రసాముపై ఉన్న ఆసక్తితో తాను నేర్చుకొని పతకాలు సాధించడంతో పాటు మరికొందరికి కర్రసాములో శిక్షణ ఇస్తూ పతకాలు పంట పండిస్తున్నాడు. సాంబయ్య మాస్టార్ 2022 నవంబరు 13న తెలంగాణలోని యూసఫ్‌గూడలో జరిగిన కర్రసాము పోటీలకు 14 మంది శిష్యులతో వెళ్లాడు. ఒక కర్ర, రెండు కర్రలు, సురులు, చైన్పంత్, జింక కొమ్ములు, ఫైటింగ్ విభాగాలలో మొత్తం 32 మెడల్స్ సాధించారు. వాటిలో 18 గోల్డ్‌మెడల్స్, 9 సిల్వర్ మెడల్స్, 5 కాంస్యాలు గెలుపొందారు. ఓవరాల్ చాంపియన్ షిప్ కప్పు అందుకోవడంతో పాటు రిఫరీగా, న్యాయ నిర్ణేతగా సర్టిఫికెట్లు అందుకున్నారు. -
సోనూసూద్‌ను కలిసిన సాంబయ్య
సాక్షి, మణుగూరుటౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెం గ్రామానికి చెందిన పడిదల సాంబయ్య అనే యువకుడు ఆదివారం ముంబైలో ప్రముఖ నటుడు సోనూసూద్‌ను కలిశాడు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడైన సాంబయ్య ఎలాగైనా సోనూను కలవాలనుకున్నారు. దీంతో గత నెల 17న కాలినడకన ముంబైకి బయలుదేరాడు. దాదాపు 1,050 కిలోమీటర్లు నడిచి ముంబైలోని ఫిలింటవర్ వద్ద సోనూసూద్‌ను కలిసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. సోనూను కలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని సాంబయ్య ‘సాక్షి’తో చెప్పాడు. -
గల్లీ కుర్రోడు.. దుమ్మురేపాడు
ఎక్కడో మారుమూల గల్లీలో బ్యాట్, బాల్‌తో క్రికెట్లో ఓనమాలు దిద్దిన పేదింటి కుర్రోడు అండర్–19 జట్టు తలుపు తట్టాడు. అంచెలంచెలుగా ప్రతిభకు పదును పెట్టుకుంటూ సెలెక్టర్ల దృష్టికి తనవైపు తిప్పుకున్నాడు. బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తించే బంతులు విసురుతూ.. అంతే వేగంగా రంజీ జట్టు వైపు దూసుకెళ్లాడు. ఇప్పటికే అనేక పతకాల పంట పండించి నేపాల్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. అతడే తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన సాంబయ్య. పొన్నెకల్లు(తాడికొండ): మండలంలోని పొన్నెకల్లు గ్రామానికి చెందిన యువకుడు షేక్ సాంబయ్య అండర్– 19 విభాగంలో భారత జట్టు తరఫున బరిలో దిగేందుకు అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. తండ్రి షేక్ సర్దార్ వృత్తిరీత్యా నవారు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పొన్నెకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ తనలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటున్న విద్యార్థికి జిల్లా స్థాయిలో పాల్గొనే అవకాశం లభించింది. అవకాశాన్ని ఒడిసిపట్టుకొని తనలోని టాలెంట్‌ను నిరూపించుకోవడంతో బౌలర్‌గా మంచి ప్రతిభ కనబరుస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా రాణించడంతో సాంబయ్యకు ఈ అరుదైన అవకాశం లభించింది. ఈ నెల 16వ తేదీన నేపాల్‌లో జరిగే ఇండో నేపాల్ సిరీస్‌లో విద్యార్థి పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సిరీస్‌లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 4 మంది విద్యార్థులు ఎంపిక కాగా అందులో సాంబయ్య కూడా ఉండటం విశేషం. గతంలో సాధించిన విజయాలివే.. ♦ 2016 జూన్ 14న అండర్–16 విభాగంలో జిల్లా జట్టు తరఫున జిల్లా చాంపియన్‌షిప్ పోటీలలో పశ్చిమ గోదావరి జట్టుపై 3 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సాధించాడు. ♦ 2016 జూన్ కడపలో జరిగిన జిల్లా చాంపియన్ షిప్ పోటీలలో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ♦ 2017 ఆగస్టు కోల్‌కత్తాలో జరిగిన మ్యాచ్‌లో విదర్భ జట్టుపై నాలుగు వికెట్లు పడగొట్టాడు. కోచ్‌ల సహకారంతోనే.. నాలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన కోచ్‌లు అనీల్, మస్తాన్ రెడ్డి, బాల కిషోర్ చౌదరిలు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఉత్తమ శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచాలనే లక్ష్యం. ఈ నెల 16వ తేదీన నేపాల్‌లో జరిగే టోర్నీకి సిద్ధమవుతున్నాను.– షేక్ సాంబయ్య, పొన్నెకల్లు. -
అక్రమ నిర్మాణాల కూల్చివేత
అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారలు కొరడా ఝులిపించారు. తీసుకున్న అనుమతికి మించి మరో అంతస్తు నిర్మించడానికి వేసిన పిల్లర్లను కూల్చివేశారు. సోమవారం బాగ్ అంబర్‌పేట డివిజన్ నందనవనం కాలనీలో ఓ భవన యాజమాని జీ ప్లస్ వన్ భవన నిర్మాణాకి అనుమతి పొంది మరో అంతస్తు నిర్మాస్తున్నట్లు సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సర్కిల్-9బి టౌన్‌ప్లానింగ్ ఏసీపీ సాంబయ్య తన సిబ్బందితో కలిసి వచ్చి అక్రమంగా నిర్మించిన అదనపు అంతస్తును కూల్చివేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాలనీలో నిబంధనలకు విరుద్దంగా తాజాగా మరో ఏడు నిర్మాణాలు చేపట్టినట్లు తమ దష్టికి వచ్చిందని వాటికి కూడా నోటీసులు జారీ చేసి కూల్చివేస్తామన్నారు. అంతే కాకుండా నింభందనలు అతిక్రమించి నిర్మాణాలు పూర్తి చేసుకున్నప్పటికి వాటిపై ప్రత్యేక సర్వే నిర్వహించి నోటీసులు జారీ చేస్తామన్నారు. సోమవారం ఒక్క భవనాన్ని ఎలా కూల్చూతారని మిగితా అన్నింటిని కూల్చలనీ స్థానికులు కొది సేపు టౌన్‌ప్లానింగ్ అధికారులతో వాగ్వివాదం చేశారు. -
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇంట్లో చోరీ
నగరంలోని బోడుప్పల్ చెంగిచర్ల క్రాంతి కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగులకొట్టి నాలుగు తులాల బంగారం, 30 తులాల వెండి దోచు కెళ్లారు. ఎస్ఐ నవీన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని చెంగిచర్ల క్రాంతి కాలనీలో సాంబయ్య కుమారుడు కృష్ణకుమార్ హైటెక్ సిటీలో సాప్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. గురువారం కృష్ణకుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లాడు. మరసటి రోజు వారు ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళాలు పగులకొట్టి ఉన్నాయి. ఇంట్లో ఉన్న 4 తులాలు బంగారం, 30 తులాల వెండి చోరీకి గురైంది. వెంటనే మేడిపల్లి పోలీస్‌లకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కృష్ణకుమార్ ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా సాంబయ్య
వరంగల్ : తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా హన్మకొండ పెద్దమ్మగడ్డకు చెందిన హన్మకొండ సాంబయ్యను నియమితులయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా సాంబయ్యతో 73 మందితో కార్యవర్గాన్ని ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శులుగా ఓరం సమ్మయ్య(భూపాలపల్లి), చంటి సిద్దులు(జనగామ), వడ్డేపల్లి కృష్ణ(నర్సంపేట), ఉపాధ్యక్షులుగా భూపతి జనార్థన్(ములుగు), సంపభీష్మ(మహబూబాబాద్), మాడ కొండయ్య(నర్సంపేట), బిర్రు అనిల్‌కుమార్(స్టేన్ ఘ), బరిగెల ఏలియా(వరధన్నపేట), సింగారపు దేవేందర్‌రాజు(వరంగల్ తూర్పు), ప్రచార కార్యదర్ళులుగా చింతల బుచ్చయ్య, ఎ.లక్ష్మయ్య, మల్లెపాక సాయిలు(వర్థన్నపేట), అ«ధికార ప్రతినిధులుగా పులి యాకయ్య, మునిగాల వెంకన్న, కందుకూరి ప్రభాకర్, కోశాధికారిగా ర త్న మల్లేష్‌ను నియమించామని తెలిపారు. ఇంకా కమిటీలో 15మంది కార్యనిర్వాహక కార్యదర్శులును, 22మంది కార్యదర్శులను, 19మందిని కార్యవర్గ సభ్యులుగా నియమించామని సత్యనారాయణరావు వివరించారు. -
విద్యుధ్ఘాతంతో వ్యక్తి మృతి
విద్యుధ్ఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాలక సాంబయ్య(50) ఇంట్లో విద్యుత్ తీగలను సరి చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామంలో ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. కర్రె సాంబయ్య నాలుగు ఎకరాల్లో సేద్యం చేస్తున్నాడు. నీరు లేక పంట ఎండిపోయింది. దీంతో వ్యవసాయం కోసం చేసిన రూ.4 లక్షలు అప్పులు తీర్చే మార్గం లేక ఆదివారం ఉదయం ఇంటి వద్ద ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాంబయ్యకు ఇద్దరు కుమార్తెలు కాగా, వారిలో ఒకరు వికలాంగురాలు. -
మద్యం అమ్ముతున్న ముగ్గురి అరెస్టు
మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుంటూరు జిల్లా రేపల్లె ఎక్సైజ్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని మైనేనివారి పాలెం గ్రామానికి చెందిన రాయని సాంబయ్య, ఉయ్యూరు పాపారావుతోపాటు చెరుకుపల్లి మండలం గూడవల్లికి చెందిన అద్దంకి శివనాగేశ్వరరావులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. -
మావోయిస్టులు వారోత్సవాలు
మంచిర్యాల సిటీ : డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా.. బుధవారం మందమర్రిలో పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు జిల్లా కార్యదర్శి బండి ప్రకాష్ స్వగ్రామమైన మందమర్రిలోని మున్సిపాలిటీ నోటీసు బోర్డుపై పోస్టర్లు వెలియడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వారోత్సవాలు నిర్వహించాలని జిల్లాలో పనిచేస్తున్న మంగి, ఇంద్రవెల్లి దళాలు నిమగ్నమయ్యాయి. ఈ రెండు దళాలే కాకుండా జిల్లా కార్యదర్శి ప్రకాష్‌తోపాటు వరంగల్ జిల్లా నుంచి వచ్చిన సాంబయ్యకు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న అదనపు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. జిల్లా నుంచి 23 మంది జిల్లా, రాష్ట్ర, కేంద్ర కమిటీలో బాధ్యతల్లో ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 400 మంది లొంగిపోయారు. 300 మంది ప్రస్తుతం జిల్లాలో సానుభూతిపరులు పనిచేస్తున్నారని నిఘా వర్గాల అంచనా. వారోత్సవాలు జిల్లాలో వీలుకాని నేపథ్యంలో ప్రాణహిత అవతల చేపట్టాలని మావోలు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ప్రాణహిత అవతల చేపడితే ఇబ్బంది ఉండదనేది పోలీసుల అభిప్రాయం. ఉనికి చాటేందుకు.. వారోత్సవాలను నేపథ్యంలో జిల్లాలో ఏదో ఒక విధం గా తమ ఉనికిని చాటుకోవాలనుకుంటున్నట్లుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది. తమ ఉనికిలో భాగం గా పోలీసులకు సమాచారం అందిస్తూ ఇబ్బందికరంగా మారిన ఇన్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వారిని ఈ పాటికే రక్షణ ప్రాంతాలకు తరలించారని, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పోలీస్ బలగాలు తమ వ్యూహానికి పదునుపెట్టినట్టు తెలిసింది. రెండు సార్లు జరిగిన ఎదురుకాల్పుల్లో తప్పించుకున్నా.. ఈసారి వారోత్సవాల్లో ఎదురుపడితే గురితప్పరాదనే లక్ష్యంతో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. కాగా.. జిల్లా కార్యదర్శి బండి ప్రకాష్ స్వస్థలం మందమర్రి పట్టణం. తన సొంత ఊరిలోనే పీఎల్జీఏ వారోత్సవాల పోస్టర్లను మంగళవారం రాత్రి వేయించి తన ఉనికిని చాటుకున్నాడు. పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం, కూరగాయల మార్కెట్టు, కేకే-5 గని ప్రాంతాల్లో వారోత్సవాల పోస్టర్లు వేయడం గమనార్హం. పోస్టరు వెలసిన మార్కెట్టు ప్రాంతం మందమర్రి పోలీస్ స్టేషన్‌కు కేవలం అర కిలోమీటరు దూరంలో ఉండటం ఆశ్చర్య పోవాల్సిన అంశం. పీజీఏ టు పీఎల్జీఏ.. పీఎల్జీఏ వారోత్సవాలు ప్రతి ఏటా డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తారు. మొదట పీపుల్స్ గెరిల్లా ఆర్మీ (పీజీఏ) డిసెంబర్2, 2000 సంవత్సరంలో ప్రారంభించింది. కేంద్ర కమిటీ సభ్యులైన నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్ కరీంనగర్ జిల్లా కొయ్యూరు ఎన్కౌంటర్లో మరణించారు. వీరి మృతికి సంతాపంగా పీజీఏను ప్రారంభించారు. అనంతరం పీజీఏను సెప్టెంబర్ 21, 2004న పీఎల్‌జీఏగా మార్చారు. రాష్ట్ర కమిటీలోకి బండి ప్రకాష్.. మావోయిస్టు జిల్లా కార్యదర్శిగా, అనుబంధ సంఘం సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్న బండి ప్రకాష్‌ను కొత్తగా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా తీసుకున్నట్లు సమాచారం. పోలీసులకు మింగుడుపడని ప్రకాష్ సింగరేణి గనులపై కొంత మేర పట్టు సాధించాడని, రెండు నుంచి మూడు గనులకు ఒకరిని తన అనుచరులను తయారు చేసుకున్నారని తెలిసింది. వీరంతా గతంలో మావోయిస్టులో పనిచేసి లొంగిపోయిన వారేనని నిఘా వర్గాలకు సమాచారం ఉంది. ఎదురుకాల్పుల నుంచి తప్పించుకుని.. జిల్లాలో మే 24న కాసిపేట మండలం వెంకటాపూర్ శివారు అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున మావోల డంప్ బయట పడింది. జూలై 31న తిర్యాణి-కాసిపేట మండలాల సమీపంలో ఉన్న మంగీ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరగడంతో మావోలు తప్పించుకున్నారు. సెప్టెంబర్ 14న తిర్యాణి మండలం పంగిడి మాదారం అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మరోసారి మావోయిస్టులు తప్పించుకున్నారు. ఈ రెండు ఘటనల్లో జిల్లా కార్యదర్శి బండి ప్రకాష్, చార్లెస్, ఆడెల్లు వంటి ముఖ్యమైన నాయకులు తప్పించుకున్నారు. ఎవరీ ఆజాద్..? జిల్లాపై మరింత పట్టు సాధించడానికి వరంగల్లు జిల్లా కు చెందిన సీనియర్ మావోయిస్టు సాంబయ్య అలియా స్ ఆజాద్ కొత్తగా జిల్లాలో సంచరిస్తున్నట్లు నిఘా వర్గా లు గుర్తించాయి. ఆజాద్ ఎత్తులను చిత్తు చేయడానికి పోలీస్ శాఖ అతని కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. పీఎల్జీఏ వారోత్సవాలను జరిపి తీరాల్సిందేనని కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న ఆజాద్‌తోపాటు బండి ప్రకాష్‌కు బాధ్యతలు అప్పగించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కోల్‌బెల్ట్ ఎమ్మెల్యే సహకారం.. కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు మావోయిస్టుల అవసరాలను అప్పుడప్పుడు తీరుస్తున్నారని రాష్ట్ర స్థాయి నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ విషయాన్ని రాష్ట్రస్థాయి పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారని విశ్వనీయ వర్గాల సమాచారం. మావోయిస్టులకు అవసరమైన సామగ్రిని వారి కొరియర్ల ద్వారా అవ సరమైన మేరకు పంపిస్తున్నారని, ఇది గతేడాది నుంచి కొనసాగుతోదని నిఘా వర్గాలు ధ్రువీకరించాయి. దీనిపై మరింత లోతుగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిఘా వర్గాలు విచారణ చేస్తున్నట్టు సమాచారం. -
ప్రతీకారం తీర్చుకున్న హంతకులు
పెద్దారవీడు, న్యూస్‌లైన్ : పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని ప్రత్యర్థులు నడిరోడ్డుపై గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన తోకపల్లె సమీపంలోని తీగలేరు బ్రిడ్జి వద్ద గురువారం సాయంత్రం జరిగింది. వివరాలు.. గొబ్బూరుకు చెందిన గోతం వెంకటేశ్వర్లు(35) కొద్ది రోజుల నుంచి మార్కాపురం పూలసుబ్బయ్య కాలనీలో నివసిస్తున్నాడు. త్రిపురాంతకం మండలం సోమేపల్లిలో నివసిస్తున్న తన సోదరులు కృష్ణ, శ్రీనుల వద్దకు వెంకటేశ్వర్లు బైకుపై వెళ్లాడు. తన అన్న కుమారుడు శివతో కలిసి తిరిగి మార్కాపురం వస్తుండగా మార్గమధ్యంలో ప్రత్యర్థులు కాపుగాసి వెంకటేశ్వర్లును హైవేపై అడ్డగించారు. ఆ బాలుడిని పక్కకు తీసి వెంకటేశ్వర్లు తలపై రాయితో విచక్షణారహితంగా మోదారు. గొంతుపై గోడ్డళ్లతో నరకటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో బాలుడు బిత్తరపోయి పెద్దగా ఏడ్వటం ప్రారంభించాడు. ఆ రహదారిపై నిత్యం వాహనాలు తిరుగుతుంటాయి. హంతకులు క్షణాల్లో తమ ప్రత్యర్థిని చంపి పరారయ్యారు. నిందితులు కూడా బైకులపై వచ్చినట్లు సమాచారం. ప్రతీకారం తీర్చుకున్న హంతకులు రెండేళ్ల కిందట గొబ్బూరు బీసీ కాలనీలో నివసిస్తున్న నాలి సాంబయ్యను చంపిన కేసులో వెంకటేశ్వర్లు మొదటి ముద్దాయి. ఆయన తాలుకా మనుషులే వెంకటేశ్వర్లును చంపి ప్రతీకారం తీర్చుకుని ఉంటారని సంఘటనా స్థలం వద్దకు వచ్చిన గొబ్బూరు వాసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడు చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కొన్నేళ్ల కిందట స్వగ్రామం గొబ్బూరు విడిచి వెళ్లి మార్కాపురం, త్రిపురాంతకం మండలంలోని సోమేపల్లిలో వెంకటేశ్వర్లు సోదరులు నివాసం ఉంటున్నారు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. హత్య జరగడంతో హైవేరోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తహశీల్దార్ గర్నెపూడి లెవి, వీఆర్వో అచ్చయ్య, మార్కాపురం రూరల్, పట్టణ ఎస్సైలు దేవకుమార్, రాంబాబు, ఏఎస్సై సుదర్శనం, రైటర్ రామకృష్ణారెడ్డిలు సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. పెద్దారవీడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మా.. సాంబనొచ్చా..!
14 ఏళ్ల తర్వాత కుమారుడి ప్రత్యక్షం చనిపోయాడనుకొని కర్మలు చేసి..సమాధి నిర్మించిన తల్లిదండ్రులు గుండాల, అమ్మా.. నేను సాంబ’ను అనే పిలుపు ఆ తల్లిదండ్రులకు ఉలిక్కిపడేలా చేసింది. 14ఏళ్ల క్రితం చనిపోయిన కొడుకు రావడమేమిటి? అసలు ఇది కలనా.. నిజమా! అని సంశయంలో పడ్డారు. ముందు నిలిచి ఉన్న కొడుకును చూసి కూడా వారు తమ కళ్లనే తాము నమ్మలేకపోయారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. జిల్లాలోని గుండాలకు చెందిన ఆవుల వెంకన్న-కనకమ్మ దంపతులకు నలుగురు సంతానం. పెద్ద కొడుకు సాంబయ్య 14ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ కోసం ఎంత వెతికినా జాడ దొరకలేదు. కొద్దిరోజుల తర్వాత విశాఖపట్నంలో సాంబయ్య పేరుగల వ్యక్తి మృతి చెందాడని పత్రికల్లో చూశారు. అక్కడికి వెళ్లి చూడగా,, మృతదేహం గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉండడంతో ఇంటికి తిరిగి వచ్చారు. సాంబయ్యనే చనిపోయి ఉంటాడనుకుని కర్మకాండలు నిర్వహించారు. అతడి స్మృతి చిహ్నంగా సమాధి కూడా నిర్మించారు. అయితే గురువారం రాత్రి ఇంటికి చేరుకున్న సాంబయ్య.. ‘అమ్మా..సాంబను వచ్చానమ్మా’ అంటూ పిలిచాడు. నిద్రలో ఉన్న తల్లిదండ్రులు తలుపు తెరిచి చూడగా.. చెట్టంత కొడుకు వాళ్ల కళ్ల ముందు నిలబడి ఉన్నాడు. చనిపోయిన సాంబయ్య రావడం ఏమిటి? అని ముందు నమ్మలేకపోయారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలు గుర్తు తెచ్చుకోవడం.. అతడి తలపై ఉన్న పాతగాయం ఆధారంగా వారు కుమారుడిని గుర్తుపట్టారు. తమ కుమారుడే అని తెలుసుకొని ఇన్నాళ్లకు వచ్చావా నాయనా.. అంటూ గుండెలకు హత్తుకున్నారు. తాను విజయవాడలో క్యాటరింగ్లో పని చేసేవాడినని సాంబయ్య విలేకరులకు తెలిపాడు. ఆరు నెలలుగా గుండెజబ్బుతో బాధపడుతున్నానని, అనారోగ్యంతో ఉన్న తనకు అమ్మానాన్నలను చూడాలనిపించి ఇంటికి తిరిగి వచ్చానని చెప్పాడు. సాంబయ్య వచ్చిన విషయం శుక్రవారం గ్రామంలో దావానలంలా వ్యాపించింది. దీంతో స్థానికులు, స్నేహితులు వచ్చి ఆప్యాయంగా పలకరిం చారు. దీంతో ఆ ఇంట పండుగ వాతావరణం నెలకొంది.