కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్ గ్రామంలో ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు.
కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్ గ్రామంలో ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. కర్రె సాంబయ్య నాలుగు ఎకరాల్లో సేద్యం చేస్తున్నాడు. నీరు లేక పంట ఎండిపోయింది. దీంతో వ్యవసాయం కోసం చేసిన రూ.4 లక్షలు అప్పులు తీర్చే మార్గం లేక ఆదివారం ఉదయం ఇంటి వద్ద ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాంబయ్యకు ఇద్దరు కుమార్తెలు కాగా, వారిలో ఒకరు వికలాంగురాలు.