'మహిళలు కీలక పదవులు దక్కించుకోవాలి'
విజయవాడ: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆకాంక్షించారు. వనితలు తాము పనిచేసే చోట కీలక స్థానాలు దక్కించుకోవాలని, తద్వారా సమాజంలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని అన్నారు. మహిళల భద్రతపై ఏబీవీపీ ఏర్పాటు చేసిన రెండు రోజుల సెమినార్ ను శుక్రవారం ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేట్ వ్యవహారాలు, పబ్లిక్ సెక్టార్ లో మహిళలు మరింతగా రాణించాలని ఆమె ఆకాంక్షించారు. చట్టం ఒక్కటే మహిళకు రక్షణ కల్పించలేదని అభిప్రాయపడ్డారు. స్త్రీలపై హింసను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు.