తిరుపతి : కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కన్నబిడ్డను కడతేర్చింది. అనురాగం పంచాల్సిన అమ్మ మనసు శిశువు ఉసురుతీసింది. పేగు తెంచుకుని పుట్టిన తన 8 నెలల మగ శిశువును తల్లి దారుణంగా హతమార్చింది. తల్లి కొట్టిన దెబ్బలకు చిన్నారి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సోమవారం తిరుపతిలోని విద్యానగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... విద్యానగర్‌కు చెందిన కరిష్మా, మోహన్ కుమార్‌లకు ఏడాదిన్నర కిందట వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న ప్రభాస్ అనే కుమారుడు ఉన్నాడు.
అయితే సోమవారం ఉదయం కోపంతో ప్రభాస్‌ను తల్లి బలంగా కొట్టడంతో గోడకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కరిష్మా గతంలో కూడా ఇలానే ప్రవర్తించేదని, పలుమార్లు చిన్నారి గాయపడేలా కొట్టిందని చిన్నారి నాయనమ్మ పోలీసులకు తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కన్నతల్లే.. బిడ్డను కడతేర్చింది
Published Mon, May 18 2015 4:41 PM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM
Advertisement
Advertisement