బేతంచెర్ల (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా బేతంచెర్లలోని గొల్లపేటకు చెందిన ఓ మహిళ తన మూడేళ్ల కుమార్తెతోపాటు జూన్14 వ తేదీ నుంచి కనిపించడంలేదని భర్త ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గొల్లపేటలో నివాసం ఉండే జోగి చంద్రుడు భార్య జోగి చంద్రకళ గత నెల14 న తన మూడేళ్ల కుమార్తె ప్రభావతిని తీస్కుని.. పాపను పాఠశాలలో చేర్పించడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లి ఇంతవరకూ తిరిగి రాలేదు. బంధువుల ఇళ్ల వద్ద విచారించినా జాడ తెలియకపోవడంతో భర్త జోగి చంద్రుడు పోలీసులను సంప్రదించాడు. పోలీసులు కేసు నమోదు చేసి తల్లీబిడ్డల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తల్లీ, బిడ్డ అదృశ్యం
Published Tue, Jul 7 2015 8:14 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM
Advertisement
Advertisement