ఉద్యమ తీవ్రత పెంచుతాం: అశోక్ బాబు | Movement intensity Increases: Ashokbabu | Sakshi
Sakshi News home page

ఉద్యమ తీవ్రత పెంచుతాం: అశోక్ బాబు

Published Mon, Dec 9 2013 4:12 PM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM

ఉద్యమ తీవ్రత పెంచుతాం: అశోక్ బాబు

ఉద్యమ తీవ్రత పెంచుతాం: అశోక్ బాబు

హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రతను పెంచుతామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీ ముట్టడికి ఉద్యోగ సంఘాలు సిద్ధమయినట్లు తెలిపారు. అసెంబ్లీ ముట్టడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ సాయంత్రం భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు.

తెలుగుతల్లి విగ్రహం వద్ద తమ బాధను వ్యక్తం చేస్తామని, నిరసన తెలుపుతామని చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తున్న సోనియా గాంధీ జన్మదినాన్ని విద్రోహదినంగా పాటిస్తున్నట్లు తెలిపారు. 4 రాష్ట్రాల్లో ఓడిపోయినా, విభజనపై కాంగ్రెస్‌ వెనక్కు తగ్గడంలేదన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని పిలుపు ఇచ్చారు.  తెలంగాణ బిల్లులో ఎన్నో లోపాలు, అవకతవకలు ఉన్నట్లు తెలిపారు. అవసరమైతే బిల్లుపై నివేదిక రూపొందించి రాష్ట్రపతికి ఇస్తామని చెప్పారు. మొత్తం ఎంపీలంతా రాజీ నామా చేయాలని అశోక్‌బాబు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement