విద్యుత్ ఉద్యోగులకు న్యాయం చేయాలి
కర్నూలు(రాజవిహార్ సెంటర్)- తెలంగాణ ప్రభుత్వం స్థానికత పేరుతో బలవంతంగా రిలీవ్‌చేసిన 1250 మంది విద్యుత్ ఉద్యోగులకు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. తెలంగాణ సర్కార్ బలవంతంగా రిలీవ్‌చేసిన 1250 మంది ఏఈ, జేఈ క్యాడర్ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ సర్కార్ విధుల్లో చేర్చుకోకపోవడంతో వారు మూడు నెలులుగా జీతాలులేక ఇబ్బందిపడుతున్నారు. వారందరూ కర్నూలు శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద రిలేనిరాహార దీక్షలు చేస్తున్నారు.
బుధవారం ధీక్షా శిబిరాన్ని సందర్శించిన కర్నూలు ఎంపీ బుట్టారేణుక మాట్లాడుతూ రెండు ప్రభుత్వాలూ చర్చించి విద్యుత్ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఉద్యోగులను ఇలా రోడ్డుపాలుచేయడం తగదని ఆమె చెప్పారు. విద్యుత్ ఉద్యోగుల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ మద్దతు తెలుపుతోందన్నారు.