కిరణ్, బొత్సలపై ఎంపీ వివేక్ నిప్పులు | MP vivek fire on CM Kiran and PCC Chief botsa | Sakshi
Sakshi News home page

కిరణ్, బొత్సలపై ఎంపీ వివేక్ నిప్పులు

Published Fri, Aug 16 2013 1:03 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

MP vivek fire on CM Kiran and PCC Chief botsa

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలపై పెద్దపల్లి ఎంపీ వివేక్ శుక్రవారం కరీంనగర్లో నిప్పులు చెరిగారు. వారిద్దరిని పదవులు నుంచి డిస్మిస్ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఉద్యమంపై వారిరువురు ఊదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నారు.

 

సీఎం కిరణ్ తెలంగాణ ద్రోహి అని ఆయన అభివర్ణించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టే వరకు టీఆర్ఎస్లోనే ఉంటానని వివేక్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎంపీ వివేక్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement