ఎంసెట్-2014 రీజినల్ కో ఆర్డినేటర్‌గా శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, డీఆర్‌సీ చైర్మన్ బమ్మిడి పోలీసు నియామకయ్యారు. జేఎన్‌టీయూ
ఎంసెట్ రీజినల్ కో ఆర్డినేటర్‌గా పోలీసు
Jan 29 2014 2:08 AM | Updated on Aug 21 2018 5:44 PM
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్:ఎంసెట్-2014 రీజినల్ కో ఆర్డినేటర్‌గా శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, డీఆర్‌సీ చైర్మన్ బమ్మిడి పోలీసు నియామకయ్యారు. జేఎన్‌టీయూ యూనివర్సిటీ, హైదరాబాద్ నుంచి ఇటీవల ఆయన నియామక ఉత్తర్వులు అం దుకున్నారు. దీంతో ఆయన ఏడోసారి ఎం సెట్ రీజినల్ కో ఆర్డినేటర్‌గా నియామకమైనట్లయింది. ఈయన నియామకంపై వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ కళాశాలలో పరీక్షలు, వివిధ విభాగాల పనిలో బిజీగా ఉన్నప్పటికీ యూనివర్సిటీ వారు ఒత్తిడి చేయడంతో కో ఆర్డినేటర్‌గా ఒప్పుకోక తప్పలేదన్నారు. ఈ ఏడాది ఎంసెట్ పరీక్షకు మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
Advertisement
Advertisement