Co-ordinator
-
రాష్ట్రంలో వికృత రాజకీయ క్రీడ
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా సంపాదించిన సొమ్ముతో టీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో వికృత రాజకీయ క్రీడ ఆడుతున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎం పదవిని చేపట్టిన కేసీఆర్ అధికార అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, రాష్ట్రాన్ని తన కుటుంబం మాత్రమే పాలించాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసే కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన అనంతరం సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. ఈ సభలో ఉత్తమ్ మాట్లాడుతూ.. నిత్యం ప్రజలతో సంబంధాలుండి మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్న జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలవడం కాంగ్రెస్ భవిష్యత్‌కు మలుపు అని అన్నారు. మండలిలో జీవన్‌రెడ్డి తెలంగాణ ప్రజల గొంతుక కావాలని, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన పనిచేయాలని కోరారు. నాడు టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీలతో కలసి మండలిలో సీఎల్పీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించే చిల్లర రాజకీయాలకు పాల్పడిన కేసీఆర్.. ఇప్పుడు అసెంబ్లీలో సీఎల్పీని విలీనం చేస్తానంటూ వికృత క్రీడ ఆడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఎదుర్కొంటామని, పోరాడుతామని ఉత్తమ్ చెప్పారు. రాష్ట్రాన్ని సొంత ఎస్టేట్‌గా భావిస్తున్నారు... కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేయడం కేసీఆర్ తరం కాదని, తమ పార్టీ నుంచి జీవన్‌రెడ్డిలు పుడుతూనే ఉంటారన్నారు. తెలంగాణలో అత్యంత అవమానకర రాజకీయ పరిస్థితులున్నాయని, రాష్ట్రాన్ని కేసీఆర్ సొంత ఎస్టేట్‌గా భావిస్తున్నారని ఆరోపించారు. ‘కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరిగి బీఫారాలు తీసుకుని ఎన్నికల్లో పోటీ చేసి చేయి గుర్తు మీద గెలిచారు. గెలిచాక పార్టీ మీద భరోసా లేదంటూ పార్టీని వీడి వెళుతున్న వారిని ఏమనాలి? పార్టీ మీద భరోసా లేనప్పుడు ఎందుకు టికెట్ అడిగారు.. పోటీ చేసి ఎలా గెలిచారు? ఇప్పుడు పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తున్నారు.’అని భట్టి వ్యాఖ్యానించారు. ఎంతమంది ఎమ్మెల్యేలు మిగిలితే అంతమందితో పోరాడతామే తప్ప కేసీఆర్ ముందు మోకరిల్లబోమని అన్నారు. కొన్నాళ్లు పోతే కేసీఆర్‌ను కుక్కలు కూడా కానని పరిస్థితి వస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. మేధావులు, విద్యావంతులు తనపై నమ్మకం ఉంచి గెలిపించార ని, దాన్ని బాధ్యతగా తీసుకుని ప్రజల పక్షాన మండలిలో గళం వినిపిస్తానన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవ హారా ల ఇన్చార్జీ కుంతియా, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ తదితరులు ప్రసంగించిన ఈ సభలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చీఫ్ కో–ఆర్డినేటర్‌గా జీవన్‌రెడ్డి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు గాను రాష్ట్ర చీఫ్ కో–ఆర్డినేటర్‌గా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పార్టీ గెలుపు కోసం ఆయన సమన్వయం వహిస్తారని పేర్కొన్నారు. -
ఉద్యోగం వదిలి... జననేత వెంట...
కాకినాడ: కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా జననేత జగన్ చేస్తున్న నిరంతర పోరాటానికి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నాగులాపల్లి ధనలక్ష్మి ఆకర్షితురాలయ్యారు. తన ఉద్యోగాన్ని వదిలి తాను కూడా వైఎస్సార్ సీపీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఆమె అభిష్టానికి అనుగుణగా వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి రంపచోడవరం మండలం యర్రంపాలెం ఆశ్రమపాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నాగులాపల్లి ధనలక్ష్మిని రంపచోడవరం నియోజకవర్గ పార్టీ కో–ఆర్డినేటర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీఏ, బీఈడీ చేసిన ధనలక్ష్మి ప్రభుత్వ టీచర్‌గా పని చేస్తున్నారు. ఆమె తల్లి రాఘవ 2001 నుంచి 2006 వరకు అడ్డతీగల మండలం గొండోలు సర్పంచిగా పనిచేశారు. తిరిగి 2013లో వైఎస్సార్ సీపీ మద్దతుతో మరోసారి సర్పంచిగా ఎన్నికయ్యారు. సుదీర్ఘ కాలంపాటు తల్లి ప్రజాసేవలో కొనసాగుతున్న నేపథ్యంలో... కుమార్తె ధనలక్ష్మి వైఎస్సార్ సీపీలో చేరి జననేత జగన్‌తో పాటు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. పార్టీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్(బాబు) ప్రోద్భలంతో ఆమెకు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యతను అప్పగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగానికి రాజీనామా ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ధనలక్ష్మి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతిని కలిసి శనివారం తన రాజీనామా లేఖను అందజేశారు. గిరిజనులకు అండగా ఉంటా... గిరిజనుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వైఎస్సార్ సీపీ రంపచోడవరం కో–ఆర్డినేటర్‌గా నియమితులైన నాగులాపల్లి ధనలక్ష్మి తెలిపారు. గిరిజనులతో పాటు, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని, వీటి పరిష్కారమే తన ప్ర«ధాన కర్తవ్యమని చెప్పారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, జగన్ సీఎం కావడమే లక్ష్యంగా పార్టీ పట్ల నిబద్దతతో పని చేస్తానని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ పటిష్టత కోసం కష్టపడి పని చేస్తానన్నారు. తనను కో–ఆర్డినేటర్‌గా నియమించిన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, పార్టీ ప్రాంతీయ పరిశీలకులు వైవీ సుబ్బారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, కో–ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
కాలిబాట వదిలితేనే పైరు పదిలం
వరి నాట్లలో సమగ్ర యాజమాన్యం తప్పనిసరి ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ సంపత్‌కుమార్ అనంతపురం అగ్రికల్చర్: వరి పంట వేసే రైతులు అధిక దిగుబడుల కోసం సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. సమగ్ర సాగు పద్ధతులు వరి నాట్లు వేయడానికి 15 రోజుల ముందుగానే పొలాన్ని దుమ్మ చేయడం ప్రారంభించి రెండు మూడు దఫాలుగా మురగబెట్టాలి. పొలమంతా సమానంగా చెక్కతోకాని ఇతరత్రా పరికరంతో చదను చేసుకోవాలి. రేగడి భూముల్లో రెండు రోజుల ముందుగా ఈ కార్యక్రమం పూర్తి చేసి నాట్లు వేసుకోవాలి. నారు తీసే సమయంలో మొక్కలు లేత ఆకుపచ్చగా ఉండాలి. నాలుగు నుంచి ఆరు ఆకులున్నపుడు నాటాలి. ముదురు నారు నాటితే దిగుబడులు తగ్గుతాయి. చదరానికి 33 మూనలు (మొక్కలు) ఉండేలా నాటుకోవాలి. ప్రతి రెండు మీటర్ల నాట్లకు 20 సెంటీమీటర్లు (సెం.మీ) కాలిబాటలు తీయడం వల్ల పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి తగ్గుతుంది. అలాగే కలుపు మందులు పిచికారి, ఎరువుల వేయడానికి అనువుగా ఉంటుంది. భూసారం ఎక్కువగా ఉన్న పొలాల్లో తక్కువ కుదుళ్లు, తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్లు ఉండేలా నాటాలి. ముదురు నారు నాటినపుడు కుదుళ్ల సంఖ్య పెంచి, కుదురుకు నాలుగైదు మొక్కలు నాటాలి. అలా నాటినపుడు నత్రజని మామూలుగా వేసేదాని కన్నా 25 శాతం ఎక్కువ వేయాలి. నీరు తక్కువగా పెట్టి నాట్లు వేసుకోవాలి. ఎరువులు, కలుపు నివారణ ఎకరాకు 96 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, 32 కిలోల పొటాష్ అవసరం. నత్రజనిని మూడు భాగాలుగా చేసి దమ్ము, దబ్బు, అంకురం దశలో వేసుకోవాలి. భాస్వరం ఒకేసారి వేసుకోవాలి. పొటాష్ ఎరువును రేగడి నేలల్లో ఒకేసారి, తేలికపాటి నేలల్లో సగం దమ్ము సమయంలోనూ మిగతా సగం అంకురం దశలో వేయాలి. నాటిన మూడు నాలుగు రోజుల్లోగా నీరు పలుచన చేసి ఎకరాకు ఒక లీటర్ బుటాక్లోర్ లేదా అర లీటర్ ప్రెటిటాక్లోర్ లేదా అర లీటర్ అలిలోఫాస్ 10 కిలోల ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లితే కలుపు సమస్య తగ్గుతుంది. నాటిన 15 నుంచి 20 రోజుల సమయంలో ఎకరాకు 50 గ్రాములు ఇథార్స్‌సల్యురాన్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. నాట్లు వేసిన రెండు నుంచి ఆరు వారాల్లో పైరు సరిగా ఎదగక జింకులోపం రావచ్చు. ముదురాకు చివర్లో, మధ్య అనెకు ఇరువైపులా తుప్పు మచ్చలు లేదా ఇటుక రంగు మచ్చలు కనబడుతాయి. దీని నివారణకు 2 గ్రాములు జింక్‌సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకోవాలి. -
వైఎస్సార్సీపీ తెలంగాణలో కోఆర్డినేటర్ల నియామకం
⇔ 23 మంది అసెంబ్లీ కోఆర్డినేటర్ల నియామకం ⇔ 10 జిల్లాలకు ఇన్చార్జులు, ⇔ 5 జిల్లాలకు కొత్త అధ్యక్షులు కూడా.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటించిం ది. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదే శాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఈ నియామకాలు చేపట్టారు. అలాగే పది జిల్లాలకు ఇన్చార్జు లు, ఐదు జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, అధికార ప్రతినిధులను నియ మించారు. సమన్వయకర్తలు వీరే.. డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి (హుజుర్నగర్), జి. శ్రీధర్‌రెడ్డి (సంగారెడ్డి), మందడి సరోజ్‌రెడ్డి (దేవరకద్ర), డాక్టర్ నగేశ్ (కరీంనగర్), అప్పం కిషన్ (భూపాలపల్లి), బీసమరియమ్మ (జడ్చర్ల), జెట్టి రాజశేఖర్ (అలంపూర్), ఇరుగు సునీల్ కుమార్ (నకిరేకల్), సంగాల ఇర్మియా (వర్ధన్నపేట), నాయుడు ప్రకాశ్ (నిజామాబాద్), బి.అని ల్‌కుమార్ (ఆదిలాబా ద్),వి.సతీశ్ (మంచి ర్యాల), బి.సంజీవ రావు (ఆంథోల్), జి.రాంభూపాల్‌రెడ్డి(కొల్లాపూర్),ఎం.భగవంతురెడ్డి(నాగర్‌కర్నూలు),ఎం.విష్ణువర్దన్‌రెడ్డి(వనపర్తి),నాడెంశాంతికుమార్(నర్సన్నపేట),లక్కినేని సుధీర్‌బాబు (ఖమ్మం),బొబ్బిలి సుధాకరరెడ్డి (షాద్న గర్),సెగ్గం రాజేశ్(మంథని), వెల్లాల రామ్మో హన్(సనత్‌నగర్),కొండా రాఘవరెడ్డి (రాజేం ద్రనగర్), డాక్టర్ ప్రఫుల్లారెడ్డి (జూబ్లీహిల్స్). జిల్లాల ఇన్చార్జులు.. రాష్ట్ర పార్టీలోని పలువురు నాయకులను ఆయా జిల్లాలకు ఇన్చార్జులుగా నియమిం చారు. జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి (నల ్లగొండ), మతిన్ ముజాదుద్దీన్ (మహబూబ్ నగర్), కె.శివకుమార్ (రంగారెడ్డి), జి.రాం భూపాల్‌రెడ్డి(హైదరాబాద్),కొండా రాఘవ రెడ్డి(నిజామాబాద్), నర్రా భిక్షపతి (ఆదిలా బాద్), బి.శ్రీనివాసరావు (కరీంనగర్), వేముల శేఖర్‌రెడ్డి(వరంగల్), డాక్టర్ ప్రఫుల్లా రెడ్డి (ఖమ్మం), వెల్లాల రామ్మోహన్ (మెదక్). 5 జిల్లాలకు అధ్యక్షుల నియామకం గతంలోనే పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించగా, తాజాగా మరో ఐదు జిల్లాల కు అధ్యక్షుల నియామకం చేశారు. మునగాల కల్యాణిరాజ్(జనగాం), బి.సంజీ వరావు (మెదక్), కొళ్ల యాదయ్య (వికారాబాద్), అతిక్ రెహమాన్(గద్వాల), వొడ్లుజు వెంకటేశ్ (యాదాద్రి). రాష్ట్ర కార్యదర్శులుగా.. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా జెట్టి రాజశేఖర్, ఇ.అవినాశ్‌గౌడ్, సంయుక్త కార్యదర్శిగా డి. వేణుమాధవ్‌రావు, అధికార ప్రతినిధులుగా జె.మహేందర్‌రెడ్డి, మతిన్ ముజాదుద్దీన్, రాంభూపాల్‌రెడ్డి, నర్రా భిక్షపతిలను నియ మించారు. -
ఆరోగ్య మిత్రలపై వేటు !
విజయనగరంఫోర్ట్: ఆరోగ్యమిత్రలు భయపడినట్లే జరిగింది. విద్యార్హతల పేరుతో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న ఆరోగ్యమిత్రల తొలగింపు ప్రక్రియకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు బుధవారం జీవో జారీ చేసింది. తక్షణమే జిల్లా మేనేజర్లను విధుల నుంచి తొలగించాలని ఈ జీవోలో పేర్కొంది. కో-ఆర్డినేటర్ మినహా అందరినీ ప్రభుత్వం నూతనంగా నిర్దేశించిన విద్యార్హతల ప్రకారం నియమించాలని సూచించింది. ఈ జీవో ప్రకారం కో-ఆర్డినేటర్ మినహా అందరినీ తొలగించినట్లేనని భావిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) పథకంలో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రోడ్డునపడనున్న మిత్రలు జిల్లాలో 102 మంది పీహెచ్సీ మిత్రలు, 30 మంది నెట్వర్క్ మిత్రలు, ఒక నెట్వర్క్ టీమ్ లీడరు, మగ్గురు డివిజన్ల్ టీమ్ లీడర్లు, ఒక జిల్లా మేనేజర్, ఒక జిల్లా కో-ఆర్డినేటర్ పనిచేస్తున్నారు. జిల్లా మేనేజర్‌ను తక్షణమే విధుల నుంచి తొలిగించాలని, మిత్రలు, టీమ లీడర్లుగా బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత ఉన్న వారిని నూతనంగా నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎనిమిదేళ్ల క్రితం ఆరోగ్యశ్రీ పథకంలో డిగ్రీ విద్యార్హతతో చేరిన వీరంతా రోడ్డున పడే దుస్థితి నెలకొంది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది 40 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. దీంతో తమకు ఇక ఉద్యోగ అవకాశాలు కూడా లేవని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పోరాటానికి సన్నద్ధం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆరోగ్య మిత్రలు గురువారం నుంచి పోరాటానికి సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వారు విధులు బహిష్కరించి ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని నిర్ణయించారు. ఏమీ పాలుపోవడంలేదు ‘ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న తమను తొలిగించడం దుర్మార్గం. ఉద్యోగం ఉందని ఆశతో జీవిస్తున్నాం. ఉద్యోగం నుంచి తొలగిస్తే భార్య, పిల్లలతో ఏ విధంగా జీవించాలి. ఏమి చేయాలో పాలు పోవడంలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఉన్న ఉద్యోగాన్ని పీకేయడం అన్యాయం. కె.మురళీధర్, ఆరోగ్యమిత్ర, విజయనగరం మా పొట్టగొట్టడం తగదు ‘చంద్రబాబు నాయుడు ఉన్నఫలంగా ఉద్యోగం తీసేసి అన్యాయం చేస్తాడని ఊహించలేదు. జీతం తక్కువ ఇచ్చినా సరే కష్ట పడి పనిచేస్తున్నాం. జీతాలు పెంచుతారని ఆశిస్తున్న తరుణంలో ఉద్యోగం తీసేయడం దారుణం. మాలాంటి వారి పొట్టగొట్టడం ప్రభుత్వానికి తగదు.’ పి.లక్ష్మి, ఆరోగ్య మిత్ర, విజయనగరం -
ఏకంగా పనిచేసే సంస్థకే కన్నం వేశాడు!
రాజమండ్రి రూరల్: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో అదే కంపెనీ ఉద్యోగి చోరీకి పాల్పడ్డాడు. సంస్థ కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న కొత్తపల్లి జేమ్స్ వినియోగదారులకు విక్రయించేందుకు శాఖలో ఉంచిన 75 బంగారు నాణాలను స్వాహా చేశాడు. సుమారు 750 గ్రాముల బరువైన ఈ నాణాల విలువ సుమారు రూ.22 లక్షలు ఉంటుందని బ్యాంకు అధికారులు అంచనా వేశారు. దీనిపై ముత్తూట్ ఫైనాన్స్ ఉన్నతాధికారి జార్జిబాబు శనివారం సాయంత్రం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేకాట, గుర్రపు పందేలు లాంటి వ్యసనాలకు బానిసగా మారిన జేమ్స్ ఈ పనికి పాల్పడినట్టు తెలుస్తోంది. -
ఎంసెట్ రీజినల్ కో ఆర్డినేటర్‌గా పోలీసు
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్:ఎంసెట్-2014 రీజినల్ కో ఆర్డినేటర్‌గా శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, డీఆర్సీ చైర్మన్ బమ్మిడి పోలీసు నియామకయ్యారు. జేఎన్టీయూ యూనివర్సిటీ, హైదరాబాద్ నుంచి ఇటీవల ఆయన నియామక ఉత్తర్వులు అం దుకున్నారు. దీంతో ఆయన ఏడోసారి ఎం సెట్ రీజినల్ కో ఆర్డినేటర్‌గా నియామకమైనట్లయింది. ఈయన నియామకంపై వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ కళాశాలలో పరీక్షలు, వివిధ విభాగాల పనిలో బిజీగా ఉన్నప్పటికీ యూనివర్సిటీ వారు ఒత్తిడి చేయడంతో కో ఆర్డినేటర్‌గా ఒప్పుకోక తప్పలేదన్నారు. ఈ ఏడాది ఎంసెట్ పరీక్షకు మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. -
ఆక్రమణను అడ్డుకుంటాం
కోదాడటౌన్, న్యూస్‌లైన్: కోదాడ ప్రభుత్వ వైద్యశాల స్థల ఆక్రమణను అడ్డుకుంటామని, తప్పుడు నివేదికలతో స్థలాన్ని కాజేయాలని చూస్తున్న విషయాన్ని తమ న్యాయవాది ద్వారా కలెక్టర్‌కు వివరించామని, కలెక్టర్ వద్ద రివ్యూ పిటిషన్ దాఖలు చేయటంతో పాటు వైద్యశాలలో ఉన్న ప్రస్తుత వివాదాస్పద స్థలంలో ఎటువంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వవద్దని కోదాడ మున్సిపాలిటీలో ఫిర్యాదు చేస్తామని జిల్లా ప్రభుత్వ వైద్యశాలల కోఆర్డినేటర్ సురేష్‌కుమార్ అన్నారు. రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ అధికారుల అదేశం మేరకు కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన ఆయన అఖిలపక్ష నాయకులతో మాట్లాడారు. ప్రభుత్వ వైద్యశాలలో మిగులు భూమిలేదని, దానిని తమ ఇంజినీర్లు ధ్రువీకరించారని తెలిపారు. కొందరు సర్వేయర్లు పక్కన ఉన్న మున్సిపాలిటీ రోడ్డును కూడా ప్రభుత్వ వైద్యశాలలో కలిపి మిగులు స్థలం ఉన్నదని తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని ఆయన అన్నారు. ఒకవేళ ఆ రోడ్డు ప్రభుత్వ వైద్యశాల స్థలంలోనిది ఐతే తాము ఆ రోడ్డును స్వాధీనం చేసుకుంటామని, వైద్యశాల స్థలంలో కలిపివేసుకుంటామని ఆయన అన్నారు. ఈ విషయంలో మున్సిపాలిటీ జోక్యం చేసుకుని నిర్మాణానికి అనుమతి ఇవ్వవద్దని కోరారు. స్థలాన్ని కాపాడుకునేందుకు రాజధాని స్థాయిలో ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు దొడ్డా నారాయణరావు, బద్దం భద్రారెడ్డి, కనగాల నారాయణ, ఎస్కె లత్తు, గంధం బంగారు, బంగారు నాగమణి, కుదరవెల్లి బసవయ్య, పొడుగు హుస్సేన్, నాళం రాజన్న, పాలకి వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ, బరిగెల పుల్లయ్య పాల్గొన్నారు.