వైఎస్సార్‌సీపీ తెలంగాణలో కోఆర్డినేటర్ల నియామకం
⇔ 23 మంది అసెంబ్లీ కోఆర్డినేటర్ల నియామకం
⇔ 10 జిల్లాలకు ఇన్‌చార్జులు,
⇔ 5 జిల్లాలకు కొత్త అధ్యక్షులు కూడా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటించిం ది. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదే శాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఈ నియామకాలు చేపట్టారు. అలాగే పది జిల్లాలకు ఇన్‌చార్జు లు, ఐదు జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, అధికార ప్రతినిధులను నియ మించారు.
సమన్వయకర్తలు వీరే..
డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి (హుజుర్‌నగర్), జి. శ్రీధర్‌రెడ్డి (సంగారెడ్డి), మందడి సరోజ్‌రెడ్డి (దేవరకద్ర), డాక్టర్ నగేశ్ (కరీంనగర్), అప్పం కిషన్ (భూపాలపల్లి), బీసమరియమ్మ (జడ్చర్ల), జెట్టి రాజశేఖర్ (అలంపూర్), ఇరుగు సునీల్ కుమార్ (నకిరేకల్), సంగాల ఇర్మియా (వర్ధన్నపేట), నాయుడు ప్రకాశ్ (నిజామాబాద్), బి.అని ల్‌కుమార్ (ఆదిలాబా ద్),వి.సతీశ్ (మంచి ర్యాల), బి.సంజీవ రావు (ఆంథోల్), జి.రాంభూపాల్‌రెడ్డి(కొల్లాపూర్),ఎం.భగవంతురెడ్డి(నాగర్‌కర్నూలు),ఎం.విష్ణువర్దన్‌రెడ్డి(వనపర్తి),నాడెంశాంతికుమార్(నర్సన్నపేట),లక్కినేని సుధీర్‌బాబు (ఖమ్మం),బొబ్బిలి సుధాకరరెడ్డి (షాద్‌న గర్),సెగ్గం రాజేశ్(మంథని), వెల్లాల రామ్మో హన్(సనత్‌నగర్),కొండా రాఘవరెడ్డి (రాజేం ద్రనగర్), డాక్టర్ ప్రఫుల్లారెడ్డి (జూబ్లీహిల్స్).
జిల్లాల ఇన్‌చార్జులు..
రాష్ట్ర పార్టీలోని పలువురు నాయకులను ఆయా జిల్లాలకు ఇన్‌చార్జులుగా నియమిం చారు. జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి (నల ్లగొండ), మతిన్ ముజాదుద్దీన్ (మహబూబ్ నగర్), కె.శివకుమార్ (రంగారెడ్డి), జి.రాం భూపాల్‌రెడ్డి(హైదరాబాద్),కొండా రాఘవ రెడ్డి(నిజామాబాద్), నర్రా భిక్షపతి (ఆదిలా బాద్), బి.శ్రీనివాసరావు (కరీంనగర్), వేముల శేఖర్‌రెడ్డి(వరంగల్), డాక్టర్ ప్రఫుల్లా రెడ్డి (ఖమ్మం), వెల్లాల రామ్మోహన్ (మెదక్).
5 జిల్లాలకు అధ్యక్షుల నియామకం
గతంలోనే పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించగా, తాజాగా మరో ఐదు జిల్లాల కు అధ్యక్షుల నియామకం చేశారు. మునగాల కల్యాణిరాజ్(జనగాం), బి.సంజీ వరావు (మెదక్), కొళ్ల యాదయ్య (వికారాబాద్), అతిక్ రెహమాన్(గద్వాల), వొడ్లుజు వెంకటేశ్ (యాదాద్రి).
రాష్ట్ర కార్యదర్శులుగా..
పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా జెట్టి రాజశేఖర్, ఇ.అవినాశ్‌గౌడ్, సంయుక్త కార్యదర్శిగా డి. వేణుమాధవ్‌రావు, అధికార ప్రతినిధులుగా జె.మహేందర్‌రెడ్డి, మతిన్ ముజాదుద్దీన్, రాంభూపాల్‌రెడ్డి, నర్రా భిక్షపతిలను నియ మించారు.