కొనసాగుతున్న పారిశుధ్య కార్మికుల సమ్మె | Municipal employees' strike Enters Second Day | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న పారిశుధ్య కార్మికుల సమ్మె

Published Tue, Oct 22 2013 11:00 AM | Last Updated on Tue, Oct 16 2018 6:47 PM

Municipal employees' strike Enters Second Day

విశాఖ: పారిశుధ్య కార్మికుల సమ్మె  జీవీఎంసీలో రెండోరోజు కూడా కొనసాగుతోంది. దాంతో నగరంలో ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోయింది. దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు సోమవారం నుంచి సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. అసలే పారిశుధ్యం అధ్వానంగా ఉన్న నేపథ్యంలో కార్మికుల సమ్మె కారణంగా పరిస్థితి మరింత దిగజారటంతో ప్రజలు సతమతమవుతున్నారు.

ఒక్క విశాఖలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరస్థితి నెలకొంది.  హైదరాబాద్ లో నిన్న ఒక్కరోజు సమ్మెతోనే ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. సాయంత్రం కురిసిన వర్షం సమస్యను మరింత తీవ్రం చేసింది. మరోపక్క ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడం, సమ్మె ను ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల హెచ్చకరితో నేడు పరిస్థితి మరింత అధ్వా నం కానుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రోజూ జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుకు వెళ్లాల్సిన 3600 మెట్రిక్ టన్నుల చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోతే పరిస్థితి ఎంత నరకప్రాయం కానుందో ఊహిస్తేనే భీతిగొల్పుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement