గుంటూరు జిల్లాలోని ముప్పాల మండల మాజీ ఎంపీటీసీ పఠాన్ హుస్సేన్ అహ్మద్(64) శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు.
గుంటూరు : గుంటూరు జిల్లాలోని ముప్పాల మండల మాజీ ఎంపీటీసీ పఠాన్ హుస్సేన్ అహ్మద్(64) శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక ప్రార్థనలు చేసి ఇంటికి తిరిగి వచ్చిన ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా.. అప్పటికే మృతిచెందారు.
నిస్వార్ధపరుడిగా, ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న హుస్సేన్ మృతి సమాచారం అందుకున్న పలు పార్టీల నాయకులు ఆయన ఇంటికి చేరుకొని ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.