సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు విధించిన రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. ఈనెల 23 వరకు అతడికి కస్టడీ విధించింది. శ్రీనివాసరావుకు విధించిన పోలీసు కస్టడీ ముగియడంతో అతడిని శుక్రవారం పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. (ఇక పోలీస్ కస్టడీ లేనట్టే!)
ఆరు రోజులపాటు పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడిని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు విచారించారు. దర్యాప్తులో భాగంగా శ్రీనివాస్ సమీప బంధువు విజయదుర్గతో పాటు అతడితో కలిసి పనిచేసిన వారిని పోలీసులు ప్రశ్నించారు. ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని టి.హర్షవర్దన్ ప్రసాద్ చౌదరి కూడా విచారించారు. అయితే విచారణ మొత్తం నిందితుడు శ్రీనివాసరావు వరకే పరిమితం చేయడం పట్ల అనుమానాలు బలపడుతున్నాయి. సూత్రధారులను కాపాడేవిధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment