సాక్షి, అమరావతి : దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కరోనా టెస్టింగ్ కిట్లు, వెంటిలేరట్లు తయారు చేస్తున్నామని పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఈ నెలాఖరు వారకు రాష్ట్రంలో రోజులు 3 నుంచి 4 వేల పరీక్షలు చేసేలా కిట్లు తయారు చేస్తున్నామన్నారు. బుధవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు( బుధవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా టెస్టింగ్ కిట్లను ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా కిట్లు సరఫరా అవుతాయన్నారు. టీబీ మెషిన్లకు అమర్చుకునేలా కిట్లను తయారు చేస్తున్నామని.. దీనివల్ల త్వరగా టెస్టింగ్ కిట్లను అమర్చుకోవచ్చని వెల్లడించారు. (కరోనా నియంత్రణపై సీఎం జగన్ సమీక్ష)
మొట్టమొదటి ఇండియన్ మేడ్ వెంటిలేటర్లను కూడా విశాఖలో తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మెడ్‌టెక్ జోన్‌కు నిధులిచ్చి సీఎం అందుబాటులోకి తెచ్చారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ముందు చూపు వల్ల ఈ రోజు కిట్లు తయారు చేయగలిగామని, సీఎం జగన్ మాటల మనిషి కాదని.. చేతల మనిషి అని ప్రశంసించారు. అలాగే రాష్ట్రంలో పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకండా అన్నిచర్యలు తీసుకుంటున్నామని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. (యూట్యూబ్ ఛానల్ ఆదాయమంతా దానికే: రకుల్ )
Comments
Please login to add a commentAdd a comment